హదీసుల జాబితా

తస్మాత్ జాగ్రత్త! నేను మీకు మహాపాపాల్లో ఘోరమైనవాటి గురించి తెలియజేయనా?
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఒక వ్యక్తి తన సోధరున్ని ప్రేమిస్తున్నప్పుడు అతనికి ఆ విషయాన్ని తప్పకుండా తెలియచేయాలి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహాపాపాలు:అల్లాహ్ (సు )కు పాటుగా ఇతరులను భాగస్వామ్య కల్పించడం,తల్లిదండ్రులకు అవిదేయత చూపటం,అన్యాయంగా హత్య చేయటం,అసత్య ప్రమాణం చేయటం.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
బీద జనులకోసం విధవల కోసం కష్టించేవాడు ధర్మపోరాటంలో జిహాద్ చేసేవానితో సమానం.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
వినాశకరమైన ఏడు పాపాల నుండి మిమ్మల్ని రక్షించుకోండి,సహాబాలు ఓ దైవప్రవక్త అవి ఏమిటి ? అని అడిగారు,ప్రవక్త బదులిస్తూ"షిర్కుబిల్లాహ్ (అల్లాహ్'కుఇతరులను భాగస్వామ్య పర్చటం) 2.చేతబడి 3.అకారణంగా అల్లాహ్ నిషేదించిన ప్రాణిని హతమార్చటం 4.వడ్డీ తినడం 5.అనాదల సొమ్మును అన్యాయంగా తినటం 6.యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవటం 7,అభాగ్యురాలైన,అమాయకులైన మహిళలపై అపనిందలు మోపటం" అని తెలియజేశారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీరు చేస్తున్న భాగస్వాముల (షిర్కు) నుండి నేను నిరుపేక్షాపరున్నీ,ఒక కార్యం చేసి దాంట్లో ఎవరైన నాకు భాగస్వామ్యపరిచినట్లైతే 'నేను అతన్నిమరియు అతను చేస్తున్నషిర్కును(భాగస్వామ్యులను)'వదిలేస్తాను
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీ గృహాలను శ్మశానాలుగా మార్చుకోకండి,నా సమాధిని జనులు కూడే ఆలయంగా మార్చకండి నాపై దరూద్ చదవండి మీరు చదివే దరూద్ లు మీరెక్కడున్నా సరే నాకు చేర్చబడుతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవము లేడు ఆయన ఏకైకుడు అతనికి ఎవరు సాటి లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమిస్తూ దాంతో పాటూ మర్యం పుత్రుడైన ఈసాను అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడుగా,మర్యం వైపుకు పంపబడ్డ దైవవాక్యం గా,అల్లాహ్ తరుపున ఊదబడిన ఆత్మగా విశ్వసించి,స్వర్గ నరకాలు సత్యం అని భావించి ఎవరైతే సాక్ష్యామిస్తారో అల్లాహ్ సు త ఆ వ్యక్తి యొక్క కార్యాలు ఎలా ఉన్న అతన్ని స్వర్గం లోకి పంపిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
{షిర్క్ చేయకుండా}ఇతరులను అల్లాహ్ కు సరిసమానంగా సాటి కల్పించకుండా ఆయన ను కలిసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు,అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించి మరెవరైతే ఆయన్ను కలుస్తాడో నరకం లో ప్రవేశిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
రెండు దవడల మధ్యనున్నది,రెండు కాళ్ళ మధ్యయున్న దాని యొక్క హామీ ఎవరైతే నాకు ఇస్తాడో అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తాను.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అత్యున్నతమైన స్మరణ ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘{వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు}
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
"మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు ‘స్వర్గం మీ చెప్పుగూడ కంటే కూడా మీకు అతి సమీపాన ఉంది,మరియు నరకం కూడా ఆ విధంగానే ఉంది".
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అయిదు పూటలా నమాజులు జుమా నుండి జుమా ,రమజాను నుండి రమజాను వాటి మధ్య గల పాపాలను ప్రక్షాలిస్తాయి.‘ఒకవేళ వ్యక్తి మహాపాపాల నుండి తనను తాను రక్షించుకున్నట్లైతే.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ముస్లిం కు ఎటువంటి కష్టనష్టాలు కలిగిన వ్యాధి,వ్యధ,భాధ,ఆందోళన చివరికి ఒక ముల్లుకుచ్చిన దాని వలన కూడా అల్లాహ్ అతని తప్పిదాలను ప్రక్షాళిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నరకాగ్ని మనోవాంఛలతో మరియు స్వర్గము కష్టములతో కప్పియున్నది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
"ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఐదు హక్కులు ఉన్నాయి :1-సలాం కు ప్రతి సలాం చేయడం ,2-రోగిని పరామర్శించటం,3-జనాజా తో పాటు నడవడం 4-దావత్ స్వీకరించటం,5-తుమ్మిన వ్యక్తి అల్హందులిల్లాహ్ పలికితే యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పటం.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
క్రియవిక్రయాలు,లావాదేవీలు జరిపే సమయం లో,సందర్భానుసారంగా దయా హృదయంతో వ్యవహరించి క్షమించిన వ్యక్తిని అల్లాహ్ కరుణిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఒకవ్యక్తి ప్రజలకు రుణాలు ఇస్తూ ఉండేవాడు,తన సేవకులకు ఆదేశిస్తూ చెప్పేవాడు ‘మీరు అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి వద్దకి వెళ్లినప్పుడు అతన్ని క్షమించి వదిలేయండి,బహుశా అల్లాహ్ తఆలా మనల్ని కూడా క్షమించి వదిలేస్తాడు,అతను అల్లాహ్ ను కలిసినప్పుడు అతని తప్పులన్నీఅల్లాహ్ క్షమించి ప్రక్షాళిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఇద్దరు ముస్లింవిశ్వాసులు పరస్పరం కత్తులతో తలబడి చంపుకున్నట్లైతే వదించినవాడు మరియు మరణించినవాడు ఇద్దరూ నరకాగ్నికి ఆహుతి అవుతారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా హలాలు విషయాలు భోదించబడ్డాయి మరియు హరాము విషయాలు భోదించబడ్డాయి,వాటి మధ్య గల విషయాలు అనుమానాస్పదమైనవి ప్రజల్లోని చాలా మందికి వాటి గురించి సరైన జ్ఞానము లేదు,ఎవరైతే ఆ అనుమానాస్పద విషయాల నుండి భయబీతి కలిగి ఉంటారో తమ ధర్మం మరియు గౌరవం యొక్క రక్షణ పొందుతారు,మరెవవరైతే అనుమానాస్పద విషయాల్లో పడతారో హరామ్ కు గురి అవుతారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా అల్లాహ్ మీ శరీరాలను ముఖాలను చూడడు ఆయన మీరు చేసే సత్కార్యాలను మరియు మీ హృదయాలను చూస్తాడు'.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా కార్యాలు ,కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి ‘ప్రతీ వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఒక వ్యక్తి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ప్రశ్నిస్తూ ఓ ప్రవక్త ‘నాకు హితోపదేశం చేయండి’’ అన్నాడు ప్రవక్త బదులిస్తూ “క్రోధించడం మానేయి” అన్నారు అప్పుడు అతను పదేపదే ప్రశ్నించాడు ;ప్రవక్త భోధిస్తూ ‘క్రోధించకూ ‘అని మాత్రమే చెప్పారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
యదార్థంగా మీరు అల్లాహ్ హక్కు ప్రకారంగా ఆయనపై దృఢనమ్మకాన్ని కలిగి ఉన్నయెడల ఏ విధంగా పక్షులకు ఆయన ఆహారాన్ని నొసగుతున్నాడో అలా మీకు ఉపాధిని నొసగుతాడు,ఆ పక్షులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బయల్దేరుతాయి సాయంత్రానికల్లా కడుపు నింపుకుని గూటికి చేరుతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఒక దాసుడు ఏదైన పాపం చేసి ‘ఓ అల్లాహ్ నా పాపాన్ని క్షమించు అని ప్రార్ధిస్తాడు. శభదాయకుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : నా దాసుడు ఏదైన పాపం చేస్తాడు,పిదప అతనికి ప్రభువు ఉన్నాడని,ఆయన తాను చేసిన పాపాన్ని మన్నిస్తాడు,మరియు పాపము వలన శిక్షిస్తాడని గుర్తిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
న్యాయపరులు పరలోక దినాన అల్లాహ్ వద్ద“జ్యోతిర్మయ మిద్దెలపై” ఆశీనులయి ఉంటారు’నిశ్చయంగా వారు తమ ఆదీనం లో ఉన్న కుటుంబీకులతో, మరియు పాలితులపట్ల న్యాయమైన విధంగా వ్యవహరించి ఉంటారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీకు ‘గీబత్’(చాడీలు)అంటే ఏమిటో తెలుసా ?అని అడిగారు దానికి సహచరులు ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కె తెలుసు అని చెప్పారు ‘ప్రవక్త సమాధానమిస్తూ’ నీ సోధరుని గురించి అతను ఇష్టపడని విషయాన్ని నువ్వు చెప్పడం అని చెప్పారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘నిశ్చయంగా కొంతమంది అల్లాహ్ యొక్క సంపద లో {సొమ్ములో} హక్కు లేకుండా నే అనవసరంగా ఖర్చు చేస్తున్నారు పరలోక దినాన వారికి అగ్నితప్ప మరేమీ ఉండదు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘అనుమానాన్ని త్యజించండి,దానికంటే ఘోర అబద్దం లేనే లేదు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ప్రతీ సత్కార్యం ఒక దానానికి సమానం’
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏ చిన్న సత్కార్యాన్ని సాదారణంగా భావించవద్దు ,అది మీ సహోదరున్నీ చిరునవ్వుతూ పలకరించడ మైనా సరే!
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘యోధుడంటే ఒకరిని మట్టి కరిపించేవాడు కాదు నిశ్చయంగా ఆవేశం లో,కోపం లో తనపై నియంత్రణ కలిగియుండువాడు"
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఎవరైతే మంచి వైపుకు మార్గం చూపుతారో అతనికి అది ఆచరించిన వానితో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మృతులను దూషించకండి నిశ్చయంగా వారు చేసిన కర్మలకనుగుణంగా పొందియున్నారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఒక ముస్లిం కోసం ‘తన సోధరుణితో మూడు రాత్రుల కంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం‘సమంజసం కాదు,ఇద్దరు కలిసినప్పుడు ఎడ ముహమ్ పెడముహమ్ తో కలుసుకుంటారు కానీ అందులో'మొదట సలాం చేసినవాడే”ఉత్తముడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గంలో ముమ్మాటికి కీ ప్రవేశించలేడు’
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
బంధువర్గాలతో తెగత్రెంపులు చేసుకునేవాడు స్వర్గ ప్రవేశాన్ని నోచుకోలేడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ఎవరైతే తన ఉపాధిలో సమృద్దిఫలాలతో పాటుగా అబివృద్దిని మరియు ఆయుష్షులో వృద్దిని కోరుకుంటాడో అతను బంధువర్గాలను కలుపుకు పోవాలి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘దాసుడు తన ప్రభువుకు ‘సజ్దా స్థితిలో ఉన్నప్పుడూ’ అతిసమీపంగా ఉంటాడు కాబట్టి మీరు ఆ స్థితిలో ఎక్కువగా దుఆ చేస్తూ ఉండండి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే అల్లాహ్ పై మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన విషయాలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి,మరేవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అతిథి ని గౌరవించాలి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
జనులపై దయచూపని వాడిపై అల్లాహ్ కూడా దయ చూపడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ప్రజల్లో కెల్లా అత్యంత అసహ్యకరమైన వారు ‘ అతిగా గొడవపడేవారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ కు అత్యంత ప్రీతిదాయకమైన వాక్యాలు నాలుగు,దాన్ని నువ్వు ఎలా ప్రారంభించిన సమస్య లేదు ‘సుబ్హానల్లాహ్ వల్హందులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
స్వర్గంలో ప్రవేశించటానికి ఎక్కువగా తోడ్పడేది అల్లాహ్ యందు భయభీతి మరియు సత్ప్రవర్తన
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
సిగ్గు బిడియం ఈమాన్ లోని భాగము.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా దుఆ యే ఆరాధన.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
రెండు వాక్యాలు నాలుక పై తేలికపాటివి,త్రాసు లో బరువైనవి,అల్లాహ్ కు ప్రీతిపాత్రమైనవి“సుబ్ హానల్లహి వ భి హమ్దిహీ ,సుబ్ హనల్లహిల్ అజీమ్”.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ వద్ద దుఆ కంటే ఎక్కువ గౌరవప్రదమైన విషయం (ఆరాధన) మరొకటి లేదు’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏ వ్యక్తి అయితే తన సహోదరుణి గౌరవాన్ని రక్షిస్తాడో పరలోక దినాన అల్లాహ్ అతని ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే సుబ్ హనల్లహి వ బి హమ్దిహీ ‘రోజులో వంద సార్లు చదువుతాడో అతని పాపాలు ఒకవేళ సముద్రపు నురగంతా ఉన్నా ప్రక్షాళించబడతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ ‘లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుళ్లి షయ్యిన్ ఖదీర్’ పది సార్లు చదువుతారో అతను ఇస్మాయీల్ సంతతి కి చెందిన నలుగురు బానిసలను విముక్తి పరచిన దానికి సమానం’
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి కలవాడిని,ధనికుడిని మరియు ఉపద్రవాల్లో విశ్వాసాన్ని రక్షించుకుంటూ దాగియున్న వాడిని ప్రేమిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సువాసన ను తిరస్కరించేవారు కాదు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
‘ప్రవర్తన పరంగా మీలోని ఉత్తములే ఈమాన్ పరంగా కూడా సంపూర్ణులు, తమ మహిలలతో మంచినడవడికతో మెలిగే వారే మీలో మేలైనవారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరిలోనైతే మృదువైఖరి ఉంటుందో అతనికి అది అలంకారంగా ఉంటుంది అదే మృదుత్వం లేకపోతే అతనికి అది ఒక లోపంగా మిగిలిపోతుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా అల్లాహ్ ఇలాంటి దాసుడని ఇష్టపడతాడు అతను ఒక అన్నం ముద్ద తిన్న దానిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఒక నీటి బుక్క త్రాగిన దాని పై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా మోమిన్ తన మంచి నడవడిక ఉత్తమ సద్వర్తన వల్ల ఉపవాసికి మరియు తహజ్జుద్ చదివే వ్యక్తి యొక్క స్థానానికి చేరుకుంటాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నిశ్చయంగా మీలోని మేలైనవారు’ఉత్తమ సద్గుణాలు కలిగిన వారే.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహోన్నతుడైన అల్లాహ్ దుర్మార్గునికి ప్రపంచం లో కొంచెం గడువు ఇస్తాడు కానీ పట్టుకున్నప్పుడు మాత్రం అతన్ని వదలడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నేను నా తదనంతరం పురుషులకు విడిచే నష్టకరమైన ఉపద్రవల్లో అతి పెద్ద ఉపద్రవం'కొంతమందిస్త్రీలు'.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
సులభతరం చేయండి కష్టతరం చేయకండి ,శుభవార్త ను అందించండి ;అసహ్యా పర్చకండి’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
గమ్య స్థానం లో చేరుకున్నవాడు ఈ దుఆ పఠించాలి ;అవూజు బి కలిమాతిల్లహిత్తామ్మాతి మిన్ శర్రి మా ఖలఖ్’ అప్పుడు అతనికి అక్కడి నుండి తిరిగి వెళ్ళేవరకి ఏ రకమైన వస్తువు నష్టం కలిగించలేదు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీలో ఎవ్వరూ కూడా ఆ క్షణం వరకు సంపూర్ణ విశ్వాసులు కాజాలరు కానీ నా పై వారికి తమ సంతానం కంటే తల్లితండ్రుల కంటే మరియు ప్రజలందరీ కంటే కూడా ఎక్కువ ప్రేమఉండాలి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
సుబ్హానల్లాహ్,వల్హందులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్'నేను ఈ విధంగా స్మరించడం.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఎవరైతే రాత్రి సూర బఖరా యొక్క చివరి రెండు వాక్యాలను పఠిస్తాడో అవి అతనికి సమృద్దం అవుతాయి.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ పవిత్ర గ్రంధం నుండి ఎవరైతే ఒక అక్షరం పఠిస్తారో అతనికి దానిపై ఒక పుణ్యం లభిస్తుంది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
కరుణించేజనులపై కరుణామయుడు (అర్రహ్మాన్)కరుణిస్తాడు,మీరు భూవాసులపై కరుణించండీ ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ము కరుణిస్తాడు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ - ‘ఖజఆ’ (తల వెంట్రుకలు ఒక భాగం కత్తిరించి మిగిలిన భాగాన్ని వదిలేవేయడం) ను వారించారు.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మాకు తకల్లుఫ్ (ఏదైనా కార్యం లేదా మాట ను అనవసర ఇబ్బందితో, శ్రమిస్తూ చేయడం) చేయకూడదని వారించబడింది.
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఏ దాసుడైతే ‘అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసులుహూ’అని అంతఃకరణ శుద్దితో సాక్ష్యమిస్తాడో అతనిపై మహోన్నతుడైన అల్లాహ్ నరకాగ్ని ని నిషేదిస్తాడు’
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
{ఓ కుమారా !అల్లాహ్ ను స్మరించుకుని (బిస్మిల్లాహ్ చదివి)కుడి చేతితో భుజించు,నీకు దగ్గరగా ఉన్న చోటు నుంచి నువ్వు భుజించు’}
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
మీరు తినేటప్పుడు కుడిచేతితో భుజించండి,త్రాగేటప్పుడు కుడిచేతితో త్రాగండి,ఎందుకంటే షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! చిన్న పాపము, పెద్ద పాపము అనే భేదం లేకుండా నేను చేయని పాపపు పని లేదు (మరి నేను క్షమించబడతానా?); దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని నీవు సాక్ష్యం పలుకలేదా?”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ఆచరణలు ఆరు రకాలు, మరియు మనుషులు నాలుగు రకాలు. (ఆచరణలలో) రెండు విధిగా జరిగేవి, సరికి సరి పరిమాణములో ప్రతిఫలం లభించేవి (రెండు), ఒక మంచి పనికి పది పుణ్యాలు రాయబడేది, ఒక మంచి పనికి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడేది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)
عربي ఇంగ్లీషు ఫ్రెంచ్