+ -

عَنْ بَهْزِ بْنِ حَكِيمٍ عَنْ أَبِيهِ عَنْ جَدِّهِ قَالَ:
قُلْتُ يَا رَسُولَ اللَّهِ: مَنْ أَبَرُّ؟ قَالَ: «أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أَبَاكَ، ثُمَّ الْأَقْرَبَ فَالْأَقْرَبَ».

[حسن] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 5139]
المزيــد ...

బహజ్ బిన్ హకీమ్ తన తండ్రి నుండి, అతను అతని తండ్రి నుండి (అంటే బహజ్ తాత నుండి)ఇలా ఉల్లేఖించినారు:
నేను ఇలా అడిగాను: "ఓ రసూలుల్లాహ్‌! నేను ఎవరి పట్ల విధేయత చూపాలి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: "నీ తల్లి, మళ్లీ నీ తల్లి, మళ్లీ నీ తల్లి, ఆ తర్వాత నీ తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలోని సమీప బంధువులు..."

[ప్రామాణికమైనది] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود - 5139]

వివరణ

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టంగా చెప్పారు: మనం విధేయత, దయ, మంచి ప్రవర్తన, స్నేహపూర్వక సహవాసం, బంధాలను ఉత్తమంగా కొనసాగించడంలో అత్యధిక అర్హత కలిగిన వ్యక్తి తల్లి. ఇతరులపై తల్లికి ఉన్న హక్కును ఆయన మూడు సార్లు పునరుద్ఘాటించడం ద్వారా, ఆమెకు ఉన్న గొప్ప స్థానం, ప్రత్యేకతను హైలైట్ చేశారు - ఇది మిగిలిన వారందరినీ మించిపోతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి తర్వాత ఎవరు ముఖ్యమో వివరించారు: "(తల్లి) తర్వాత తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలో దగ్గర వారు, తదితరంగా." బంధుత్వంలో ఎవరు ఎంత దగ్గరగా ఉంటే, వారితో బంధాన్ని కొనసాగించడంలో వారికి అంత ఎక్కువ హక్కు ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు.

من فوائد الحديث

  1. ఈ హదీథులో, మొదట తల్లికి, తర్వాత తండ్రికి, ఆ తర్వాత బంధుత్వంలో సమీప బంధువులకు, వారి బంధుత్వానికి అనుగుణంగా ప్రాముఖ్యత ఇవ్వబడింది.
  2. తల్లిదండ్రుల స్థానం గురించి, ముఖ్యంగా తల్లి యొక్క గొప్ప స్థానం గురించి ఇక్కడ స్పష్టం చేయబడింది.
  3. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లికి విధేయత చూపడం ఎంత ముఖ్యమో స్పష్టం చేసేందుకు దానిని మూడుసార్లు పునరుద్ఘాటించారు. ఇది తల్లి తన పిల్లలకు చేసిన గొప్ప ఉపకారానికి, ఆమె ఎదుర్కొన్న అనేక కష్టాలు, అలసట, ఇబ్బందులకు గుర్తుగా ఆమె హక్కును తెలిపినారు. ఉదాహరణకు, గర్భధారణ, ప్రసవం, పాలిచ్చడం వంటి బాధలు, బాధ్యతలు తల్లికి మాత్రమే ప్రత్యేకమైనవి. ఈ తర్వాత పిల్లల పెంపకంలో తండ్రితో కలిసి తల్లికూడా భాగస్వామి అవుతుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية الرومانية المجرية الموري Малагашӣ الولوف الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా