عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: «الصلوات الخمس، والجمعة إلى الجمعة، ورمضان إلى رمضان مُكَفِّراتٌ لما بينهنَّ إذا اجتُنبَت الكبائر».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూహురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తున్నారు ‘అయిదు పూటలా నమాజులు జుమ నుండి జుమా ,రమజాను నుండి రమజాను వాటి మధ్య గల పాపాలను ప్రక్షాలిస్తాయి.‘ఒకవేళ వ్యక్తి మహాపాపాల నుండి తనను తాను రక్షించుకున్నట్లైతే.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఐదు వేళల నమాజులు వాటి మధ్యగల పాపాలను-చిన్నపాపాలను- ప్రక్షాళిస్తాయి, ఘోరపాపములను తౌబా మాత్రమే ప్రక్షాలిస్తుంది,ఇలాగే జుమా నమాజు ఆ తరువాత జుమా వరకు గల పాపాలను,ఇలాగే రమదాను ఉపవాసాలు ఆ తరువాత వచ్చే రమదాను వరకి గల పాపాలను ప్రక్షాలిస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. ఈ రకమైన విధులను సక్రమంగా శ్రద్ద ఏకాగ్రతతో ఆచరించినట్లైతే ‘మహోన్నతుడైన అల్లాహ్ తన దయా,కారుణ్యాలతో వాటి మధ్యలో అతను చేసిన చిన్నచిన్న తప్పిదాలను క్షమించడానికి’ ఆ కార్యం కారణమవుతుంది.
  2. పాపాలు ‘కబాయిర్(ఘోరపాపాలుగా) మరియు సగాయిర్’(చిన్నపాపాలుగా)గా విభజించబడ్డాయి.
ఇంకా