عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يَقُولُ:
«اللهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى وَالتُّقَى، وَالْعَفَافَ وَالْغِنَى».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2721]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను.""
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2721]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇవి ఉన్నాయి: “ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం కోసం అడుగుతున్నాను,” అంటే సత్యాన్ని తెలుసుకుని దానిని అనుసరించడానికి సరళమైన మార్గం, “భక్తి,” అంటే ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధాలను నివారించడం, “పవిత్రత,”అంటే మాటలో లేదా క్రియలో అనుమతించబడని లేదా సముచితమైన వాటికి దూరంగా ఉండటం మరియు “సమృద్ధి”, అంటే ఒక వ్యక్తికి సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడు అయిన తన ప్రభువు తప్ప మరెవరి అవసరం లేకపోవడం.