عن خولة الأنصارية رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم : «إن رجالاً يَتَخَوَّضُون في مال الله بغير حق، فلهم النار يوم القيامة».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

ఖౌలా అల్ అన్సారీ రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తూ తెలియజేశారు ‘మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం భోదించారు ‘నిశ్చయంగా కొంతమంది అల్లాహ్ యొక్క సంపద లో సొమ్ములో హక్కు లేకుండా నే అనవసరంగా ఖర్చు చేస్తున్నారు పరలోక దినాన వారికి అగ్నితప్ప మరేమీ ఉండదు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ముస్లింల ఆస్తులను అన్యాయంగా ఖర్చుచేసే వ్యక్తుల గురించి తెలియపరిచారు,నిశ్చయంగా వారు అన్యాయంగా ఆ సొమ్మును లాక్కుంటారు, ఈ వర్గంలో : అనాథల ఆస్తులను వినియోగించడం, వక్ఫ్ ఆస్తులను,డబ్బును అనర్హులకు అనవసరంగా నిర్వహించడం, అమానతులను తిరస్కరించడం మరియు ఏ హక్కులేకుండా లేదా అనుమతి లేకుండా ప్రజా నిధులను తీసుకోవడం వస్తాయి,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియజేశారు :అలాంటి వారికి పరలోక దినమున నరకాగ్ని శిక్ష ఉంటుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. హలాల్ మార్గంగా తప్ప మనిషికి డబ్బు సంపాదించడం నిషేదించబడినది,ఎందుకంటే హారములో మునిగి దాన్ని సంపాదించడం అందులో అన్యాయంగా విక్రయాలు జరిపడం నిషేదం.
  2. డబ్బు ముస్లిముల చేతుల్లో ఉన్నా మరియు పాలకులచేతుల్లో ఉన్నా అది అల్లాహ్ డబ్బు,ఆయన వారికి దానిపై అధికారాన్ని కట్టబెట్టాడు తద్వారా షరీయతు పరమైన మార్గంలో దాన్ని ఖర్చు చేయాలి,అక్రమంగా దాన్ని ఖర్చుచేయడం హరాము,ఈ సూత్రం పాలకులతో పాటు సమస్త సాధారణ ముస్లిములకు కూడా వర్తిస్తుంది.
ఇంకా