عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ الدُّنْيَا حُلْوَةٌ خَضِرَةٌ، وَإِنَّ اللهَ مُسْتَخْلِفُكُمْ فِيهَا، فَيَنْظُرُ كَيْفَ تَعْمَلُونَ، فَاتَّقُوا الدُّنْيَا وَاتَّقُوا النِّسَاءَ، فَإِنَّ أَوَّلَ فِتْنَةِ بَنِي إِسْرَائِيلَ كَانَتْ فِي النِّسَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2742]
المزيــد ...
అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీలు సంతతిలో అరాచకత్వం ప్రబలడానికి వారి స్త్రీ లాలసే మొదటి కారణం అయినది.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2742]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: ఈ ప్రపంచం రుచిలో మధురమైనది, మరియు చూడడానికి సుందరమైనది. కనుక దాని వలన ఒక వ్యక్తి తేలికగా ప్రలోభానికి గురి అవుతాడు, అందులో మునిగిపోతాడు, మరియు దానినే తన కొరకు అత్యంత విలువైనదిగా మార్చుకుంటాడు. అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితములో మనకంటే ముందు వచ్చిన వారికి మనలను వారసులుగా చేసినాడు – ఏ విధంగా వ్యవహరిస్తామో చూడడానికి; ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తామా లేక అవిధేయులుగానా? తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించినారు: జాగ్రత్త ఈ ప్రపంచపు సరంజామాతోనూ, మరియు దాని సౌందర్యముతోనూ మోసపోకండి; అది (ప్రపంచం) మిమ్ములను అల్లాహ్ ఆదేశించిన వాటిని వదిలేసి, ఆయన నిషేధించిన వాటిలో పడిపోవడానికి దారి తీస్తుంది. ఈ ప్రపంచపు ఆకర్షణలలో అన్నింటికన్నా పెద్దది స్త్రీలపట్ల ఆకర్షణ. ఇస్రాయీలు సంతతి పడిపోయిన మొదటి ఆకర్షణ అది.