عن أبي الدرداء رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ رَدَّ عَنْ عِرْضِ أَخِيهِ رَدَّ اللهُ عَنْ وَجْهِهِ النَّارَ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1931]
المزيــد ...
అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.
[దృఢమైనది] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي - 1931]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం పరోక్షములో అతడి గౌరవాన్ని కాపాడే ముస్లిమును గురించి తెలియజేస్తున్నారు. ఆ ముస్లిం పరోక్షములో ఎవరైనా అతడి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే లేదా అతడి గురించి అపవాదులు ప్రచారం చేస్తూ ఉంటే, అతడు ఆవిధంగా చేస్తున్న వాడిని వారిస్తాడు. తన ముస్లిం సోదరుని గౌరవాన్ని కాపాడుతాడు. అటువంటి వాని నుండి తీర్పు దినము నాడు అల్లాహ్ శిక్షను మరల్చి వేస్తాడు.