عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «ما نقصت صدقة من مال، وما زاد الله عبدا بعفو إلا عزا، وما تواضع أحد لله إلا رفعه الله عز وجل »
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రవచించారు’ ఒకరికి డబ్బు దానం చేయడం వలన సంపదలో ఎలాంటి తరుగు జరుగదు,ఒకరిని మన్నించి వదిలిన వాడికి అల్లాహ్ గౌరవాన్ని నొసగుతాడు,శక్తిమంతుడైన మహొన్నతుడైన అల్లాహ్ కోసం వినమ్రతను పాటించేవాడికి అల్లాహ్ పురోగతిని ప్రసాదిస్తాడు’.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

దాతృత్వం ఎప్పుడూ సంపదను తగ్గించదు; "అర్థం: ఒక వ్యక్తి దాతృత్వం ఇస్తే, అతని ఔదార్యం వల్ల అతని సంపద తగ్గదు,దాతృత్వం సంపదను పెంచుతుంది, సమృద్ది పరుస్తుంది మరియు దానిని ప్రభావితం చేసే చెడులను దూరం చేస్తుంది.సంపదలో పరిమాణం పరంగా సమృద్ది పరంగా వృద్దిని నొసగుతాడు : అల్లాహ్ దాత వ్యక్తికి జీవనోపాధి తలుపులు తెరుస్తాడు ,సంపదలో సమృద్దిని నోసగుతాడు తద్వారా అతను ఖర్చుచేసిన దాతృత్వ పరిమాణంకంటే కూడా ఎక్కువగా ప్రాప్తిస్తుంది/- " అల్లాహ్ ఇతరులను గౌరవంగా క్షమించేవారికి తప్ప అబివృద్ది ప్రసాదించడు" అనగా 'ప్రజలను క్షమించటం తెలిసినవాడు ఇతరుల తప్పులను పట్టుకోవడం మరియు నిందించడం మానుకుంటాడు,నిశ్చయంగా ఇలాంటి వ్యక్తి ప్రజల హృదయాలను జయించి ఏలుతాడు, అతని;గౌరవ మర్యాదల్లో వృద్ది ప్రాప్తిస్తుంది,మరియు ప్రాపంచిక,పరలోక పరంగా గొప్పవాడు అవుతాడు,ఎవరైతే అల్లాహ్ పట్ల వినమ్రతను కలిగియుంటాడో అల్లాహ్ అతనికి అబివృద్ది నొసగుతాడు”-"అర్ధం: అల్లాహ్ ముందు తనను తాను అర్పించుకునే వ్యక్తి,తన బలహీనత మరియు నిస్సహాయతను అంగీకరించేవాడు,మరియు ప్రజలతో దయ,జాలి మరియు సానుభూతితో మెదిలేవాడు,ముస్లిముల పట్ల గౌరవం వ్యక్తపరిచేవాడు,నిశ్చయంగా ఈ సద్గుణాలు ప్రజల హృదయాలలో అతని పట్ల ప్రేమను పెంచడం తో పాటు ప్రాపంచిక పరంగా అతన్ని గొప్పవాడిగా మారుస్తాయి,పరలోక పరంగా స్వర్గ అంతస్తులకు అర్హుడిగా చేస్తాయి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసు నిర్లక్ష్యం చేయకుండా దాతృత్వం చేయాలని ప్రోత్సహిస్తుంది.
  2. నిశ్చయంగా దానము సంపదకు రక్షణ చేకూర్చడంలో,వృద్దిపర్చడంలో మరియు సమృద్ది పర్చడానికి కారణమవుతుంది.
  3. డబ్బులో పెరుగుదల అర్ధవంతంగా ఉండవచ్చు,బహుశా అల్లాహ్ అతనికి జీవనోపాధి తలుపులు తెరిచినట్లు,మరియు డబ్బులో పెరుగుదల ఇంద్రియంగా కూడా ఉండవచ్చు అనగా అల్లాహ్ డబ్బుపై సమృద్దిని కురిపిస్తాడు అప్పుడు అది చెల్లించిన దానదర్మం కంటే ఎక్కువగా డబ్బు వృద్ది చెందుతుంది.
  4. అపరాధికి క్షమాపణ ఇవ్వమని ప్రోత్సహిస్తుంది
  5. వినయ వినమ్రతలు పాటించాలని ఈ హదీసు ప్రేరణ ఇస్తుంది.
  6. నిశ్చయంగా వినయవినమ్రతలు కలిగియుండటం కొంతమంది అవమానంగా భావిస్తారు,కానీ మహనీయ దైవప్రవక్త తెలియజేసిన ప్రకారంగా అది ఒక గౌరవప్రద విషయం.
  7. ఇది వినయవినమ్రతకు గల ప్రాముఖ్యత,అంటే రియాకు తావులేకుండా కేవలం అల్లాహ్ కొరకు చిత్తశుద్దితో వినయవినమ్రతలు ప్రదర్శించినవాడికి చెందుతుంది.(అల్లాహ్ కొరకు మాత్రమే వినయం కలిగినవాడు)
  8. నిశ్చయంగా గౌరవమర్యాదలు మరియు కీర్తి మహోన్నతుడు,పరమపవిత్రుడు అల్లాహ్ చేతిలో ఉంటాయి,వాటి కారణాలను అవలంబించిన వారిలో కోరుకున్నవారికి ఆయన ఇస్తాడు