+ -

عَنْ خُرَيْمِ بْنِ فَاتِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْأَعْمَالُ سِتَّةٌ، وَالنَّاسُ أَرْبَعَةٌ، فَمُوجِبَتَانِ، وَمِثْلٌ بِمِثْلٍ، وَحَسَنَةٌ بِعَشْرِ أَمْثَالِهَا، وَحَسَنَةٌ بِسَبْعِ مِائَةٍ، فَأَمَّا الْمُوجِبَتَانِ: فَمَنْ مَاتَ لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ مَاتَ يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ النَّارَ، وَأَمَّا مِثْلٌ بِمِثْلٍ: فَمَنْ هَمَّ بِحَسَنَةٍ حَتَّى يَشْعُرَهَا قَلْبُهُ، وَيَعْلَمَهَا اللهُ مِنْهُ كُتِبَتْ لَهُ حَسَنَةً، وَمَنْ عَمِلَ سَيِّئَةً، كُتِبَتْ عَلَيْهِ سَيِّئَةً، وَمَنْ عَمِلَ حَسَنَةً فَبِعَشْرِ أَمْثَالِهَا، وَمَنْ أَنْفَقَ نَفَقَةً فِي سَبِيلِ اللهِ فَحَسَنَةٌ بِسَبْعِ مِائَةٍ، وَأَمَّا النَّاسُ، فَمُوَسَّعٌ عَلَيْهِ فِي الدُّنْيَا مَقْتُورٌ عَلَيْهِ فِي الْآخِرَةِ، وَمَقْتُورٌ عَلَيْهِ فِي الدُّنْيَا مُوَسَّعٌ عَلَيْهِ فِي الْآخِرَةِ، وَمَقْتُورٌ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَمُوَسَّعٌ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ».

[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 18900]
المزيــد ...

ఖురైమ్ ఇబ్న్ ఫాతిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఆచరణలు ఆరు రకాలు, మరియు మనుషులు నాలుగు రకాలు. (ఆచరణలలో) రెండు విధిగా జరిగేవి, సరికి సరి పరిమాణములో ప్రతిఫలం లభించేవి (రెండు), ఒక మంచి పనికి పది పుణ్యాలు రాయబడేది, ఒక మంచి పనికి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడేది. రెండు విధిగా జరిగేవి కార్యాలు: ఎవరైతే ఎవరినీ మరియు దేనినీ అల్లాహ్ కు సాటి కల్పించని స్థితిలో చనిపోతాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు, మరియు ఎవరైతే ఎవరినైనా లేక దేనినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ చనిపోతాడో, అతడు నరకములోనికి ప్రవేశిస్తాడు. సరికి సరి ఆచరణలు: ఎవరైతే ఏదైనా సత్కార్యము చేయాలని అనుకుంటాడొ, అది అతని హృదయములో సంకల్ప రూపము దాలుస్తుందో, మరియు అల్లాహ్ దానిని (ఆసంకల్పము యొక్క నిష్కల్మషత్వాన్ని) గుర్తిస్తాడో, అతడికి (కేవలం సంకల్పము చేసినందుకు) ఒక పుణ్యము రాయబడుతుంది. మరియు ఎవరైతే ఏదైనా చెడు కార్యాన్ని చేస్తాడో అతనికి ఒక చెడుపని చేసినట్లుగా రాయబడుతుంది. మరియు ఎవరైతే (సంకల్పించుకున్న) సత్కార్యాన్ని అమలు చేస్తాడో, అతనికి దానికి సమానమైన పది పుణ్యాలు రాయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గములో ఖర్చుపెడతారో అతనికి ఏడు వందల రెట్లకు సమానమైన పుణ్యాలు వ్రాయబడతాయి. ఇక ప్రజల విషయానికి వస్తే, కొందరిపై ఈ ప్రాపంచిక జీవితములో సంపన్నత ఉంటుంది, పరలోక జీవితములో వారిపై పేదరికం ఉంటుంది, కొందరికి భూమిపై పేదరికం ఉంటుంది, కానీ పరలోక జీవితములో వారిపై సంపన్నత ఉంటుంది, కొందరిపై ప్రాపంచిక జీవితములోనూ మరియు పరలోక జీవితములోనూ పేదరికం ఉంటుంది, మరి కొందరిపై ప్రాపంచిక జీవితములోనూ మరియు పరలోక జీవితము నందునూ సంపన్నత ఉంటుంది.

[ప్రామాణికమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 18900]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలు ఆరు రకాలుగా ఉంటాయని, ప్రజలు నాలుగు రకాలుగా ఉంటారని తెలియజేసారు. ఆ ఆరు ఆచరణలు ఇవి:
మొదటిది: ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోతాడో స్వర్గము అతనిపై విధి అయిపోతుంది.
రెండవది: ఎవరైతే అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో చనిపోతాడో, నరకం అతనిపై విధి అయిపోతుంది, అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు.
ఇవి రెండూ విధిగా జరిగే కార్యాలు.
మూడవది: కల్మశం లేని సంకల్పాలు: ఎవరైనా ఒక మంచి పని చేయాలని అనుకుని, దానిని తన హృదయంలో బలంగా సంకల్పించుకున్నట్లయితే, మరియు అతని సంకల్పం (అందులో ఎటువంటి కల్మశం లేకపోవడం) అల్లాహ్ గుర్తింపు పొందినట్లయితే, తరువాత అతనికి ఏదైనా అవరోధం ఎదురై అతడు ఆ మంచి పనిని చేయలేక పోయినా, అతడు ఆ సంకల్పించుకున్న మంచిపని పూర్తిగా చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది.
నాలుగవది: ఆచరించబడిన చెడు పని: ఎవరైనా ఏదైనా చెడుపని చేసినట్లైతే, అతడు ఒక చెడు పని చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది.
ఇవి సరికి సరి పరిమాణములో, ఎటువంటి తగ్గింపు లేకుండా, ప్రతిఫలం వ్రాయబడేవి.
ఐదవది: ఒక మంచి పనికి పది రెట్లు పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే మంచి పని చేయాలని (కల్మశం లేని విధంగా) సంకల్పించుకుని, అవరోధం ఎదురైన కారణంగా దానిని ఆచరించలేక పోయినాడో, అతడు తాను సంకల్పించుకున్న మంచి పనిని ఆచరించినట్లయితే, దానికి సమానమైన పది పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి.
ఆరవది: ఒక మంచి పనికి ఏడు వందల రెట్ల పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే తన సంపదను అల్లాహ్ మార్గములో ఖర్చు పెడతాడో, ఆ ఒక్క సత్కార్యము కొరకు అతనికి దానికి సమానంగా ఏడు వందల రెట్లు పుణ్యాలు అతని పేర వ్రాయబడతాయి. ఇది శుభాల ప్రదాత, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తన ఘనత, మరియు దాతృత్వము, మరియు తన దాసులపై ఆయన యొక్క కరుణకు ప్రతీక.
మరియు నాలుగు రకాల ప్రజలు ఎవరంటే:
ఒకటవ రకం: ఎవరిపైనైతే ఈ భూమిపై సంపన్నత ఉంటుందో, అందులో అతడు కోరుకున్న ప్రతిదీ అతనికి లభిస్తూ ఉంటుందో, అటువంటి వారికి పరలోకమున చాలా కష్టతరమైన జీవితం ఉంటుంది. వారి గమ్యస్థానము నరకాగ్ని అయి ఉంటుంది. అతడు సంపన్నుడయిన తిరస్కారుడై ఉంటాడు.
రెండవ రకం: ఉపాధికి సంబంధించి ఇతనిపై భూలోక జీవితంలో పేదరికం ఉంటుంది. కానీ పరలోక జీవితంలో ఇతనిపై సంపన్నత ఉంటుంది. మరియు ఇతని గమ్యస్థానము స్వర్గము. అతడు పేదవాడైన విశ్వాసి.
మూడవ రకం: ఇతడు భూలోకములోనూ మరియు పరలోకములోనూ పేదవాడు. ఇతడు పేదవాడైన అవిశ్వాసి.
నాలుగవ రకం: ఇతడు భూలోక జీవితములోనూ, పరలోక జీవితములోనూ సంపన్నుడై ఉంటాడు. ఇతడు సుసంపన్నుడైన విశ్వాసి.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ الفولانية ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ اليونانية الأوزبكية الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో తన దాసులపై మాహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఘనత గురించి మరియు అనుగ్రహము గురించి తెలుస్తున్నది. మరియు తన దాసులు సత్కార్యాలు చేయడం పట్ల ఆయన బలహీనత (అపారమైన కారుణ్యం) గురించి తెలుస్తున్నది.
  2. అలాగే ఈ హదీసులో తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన కరుణ తెలుస్తున్నది. ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఆయన న్యాయంగా ఒక్క చెడు పని చేసిన ప్రతిఫలమే లెక్కిస్తున్నాడు.
  3. 'షిర్క్' (అల్లాహ్ కు ఎవరినైనా సాటి కల్పించడం) ఎంత ప్రమాదకరమైన ఆచరణో తెలుస్తున్నది. అది స్వర్గం నుండి మనలను దూరం చేస్తుంది.
  4. ఇందులో అల్లాహ్ యొక్క మార్గములో ఖర్చు చేయడం యొక్క ఘనత తెలుస్తున్నది.
  5. అల్లాహ్ మార్గములో ఖర్చు చేయుట యొక్క ప్రతిఫలం మరింత పెరగడం అనేది ఏడు వందల రెట్లు పెరగడం నుంచి మొదలవుతుంది. అది అల్లాహ్ యొక్క వాక్కును ఉన్నతం చేస్తుంది.
  6. ఇందులో ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటారో మరియు ఆయా రకాల మధ్య భేదాలు ఏమిటో ప్రస్తావించబడింది.
  7. ఈ ప్రాపంచిక జీవితములో సంపన్నత అనేది విశ్వాసికీ, మరియు అవిశ్వాసికీ ఉంటుంది. కానీ పరలోక జీవితములో సంపన్నత అనేది కేవలం విశ్వాసికి మాత్రమే ఉంటుంది.
ఇంకా