عن النُّعمان بن بَشير رضي الله عنه قال: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ -وَأَهْوَى النُّعْمَانُ بِإِصْبَعَيْهِ إِلَى أُذُنَيْهِ-:
«إِنَّ الْحَلَالَ بَيِّنٌ وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنَ النَّاسِ، فَمَنِ اتَّقَى الشُّبُهَاتِ اسْتَبْرَأَ لِدِينِهِ وَعِرْضِهِ، وَمَنْ وَقَعَ فِي الشُّبُهَاتِ وَقَعَ فِي الْحَرَامِ، كَالرَّاعِي يَرْعَى حَوْلَ الْحِمَى يُوشِكُ أَنْ يَرْتَعَ فِيهِ، أَلَا وَإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى، أَلَا وَإِنَّ حِمَى اللهِ مَحَارِمُهُ، أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً، إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1599]
المزيــد ...
ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం – “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను”; తాను చెవులారా విన్నట్లుగా, ను’మాన్ ఇబ్న్ బషీర్ తన చేతుల (చూపుడు) వేళ్ళను తన చెవులకు దగ్గరగా తీసుకుని వెళ్ళి చూపించినారు:
“నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1599]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్’లో విషయాలకు సంబంధించి ఒక సాధారణ నియమాన్ని గురించి విశదీకరించారు. షరియత్ లో విషయాలు మూడు వర్గాలుగా విభజించ బడినాయి. అవి ‘హలాల్’ విషయాలుగా (అనుమతించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి, ‘హరామ్’ విషయాలుగా (నిషేధించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి మరియు ‘హలాల్’ వర్గానికి చెందినవా లేదా ‘హరామ్’ వర్గానికి చెందినవా అనే స్పష్టత లేని ‘సందిగ్ధ విషయాలు’. ఆ విషయాలకు సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటో ప్రజలలో చాలా మందికి తెలియదు.
మరి ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలను (వాటి జోలికి పోకుండా) వదిలివేస్తాడో, అతడు ‘హరామ్’ లో పడిపోకుండా తన ధర్మాన్ని స్థిరంగా, సురక్షితంగా ఉంచుకున్న వాడవుతాడు. అలాగే (తనకు ఙ్ఞానము లేని) సందిగ్ధ విషయాల జోలికి వెళ్ళినందుకు, ప్రజలు అతడిపై వేసే భాండాలనుండి తన గౌరవాన్ని కాపాడుకున్న వాడవుతాడు. మరియు ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలనుండి దూరంగా ఉండడో, అతడు తనను తాను ‘హరామ్’ లో పడిపోవడానికి లేదా ప్రజల అపవాదులకు, అగౌరవానికి గురిచేసుకున్న వాడవుతాడు. సందిగ్ధ విషయాలకు దూరంగా ఉండకుండా, (తగినంత ఙ్ఞానము లేకపోయినా) వాటి జోలికి వెళ్ళే వాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పశువుల కాపరితో పోల్చినారు. ఆ పశువుల కాపరి తన పశువులను, ఒక ఆసామి యొక్క స్వంత పొలానికి అతి దగ్గరగా మేపుతూ ఉంటాడు; ఏ క్షణమైనా తన పశువులు గట్టుదాటి ఆ పొలములోనికి దూరిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ. అదే విధంగా, ఒక విషయం ‘హలాల్’ వర్గానికి చెందినదా, లేక ‘హరామ్’ వర్గానికి చెందినదా అనే స్పష్టత లేనపుడు, ఆ విషయానికి సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటి అనే ఙ్ఞానం లేనపుడు దాని జోలికి వెళ్ళే వ్యక్తి, హరాం లో పడిపోయేటంత ప్రమాధకరమైన స్థితికి అతి దగ్గరగా వెళుతున్నాడన్నమాట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. దేహంలో ఒక మాంసపు ముద్ద (హృదయం) ఉంటుందని, ఒకవేళ అది సరిగా (ఆరోగ్యవంతంగా) ఉంటే అది మొత్తం శరీరపు ఆరోగ్యతకు బాధ్యత వహిస్తుందని; ఒకవేళ అది కల్మష పడిపోతే, కలుషితమైపోతే మొత్తం శరీరం అదేవిధంగా మారడానికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.