హదీసుల జాబితా

.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది*. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ