+ -

عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «ما نهيتكم عنه فاجتنبوه، وما أمرتكم به فأْتُوا منه ما استطعتم، فإنما أَهلَكَ الذين من قبلكم كثرةُ مسائلهم واختلافهم على أنبيائهم».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘నేను మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ చెప్తుండగా విన్నాను ‘నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి]

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మనకు మార్గనిర్దేశం చేసారు,ఆయన ఏదైనా విషయాన్ని నిషేధించినట్లయితే,ఎటువంటి మినహాయింపు లేకుండా దానికి దూరంగా ఉండాలి,మరియు ఏదైనా చేయమని మనకు ఆదేశిస్తే శక్తిమేరకు చేయగలిగినంతగా దాన్నిఆచరించాలి,పిదప మునుపటి జాతుల మాదిరిగా మనము మారకూడదని ఆయన హెచ్చరించారు,వారు వారి ప్రవక్తలను అధిక ప్రశ్నలు అడిగారు,వారితో విభేదించారు, కాబట్టి అల్లాహ్ వారిని విధ్వంసకరమైన మరియు వినాశనకరమైన వివిధ రకాల శిక్షలకు గురిచేశాడు,కాబట్టి వారు నడిచిన మార్గాల్లో అనుసరించకుండా ఉన్నట్లైతే వారిలా నాశనం కాకుండా మనము రక్షించుకోగలము.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఆదేశాలను శిరసావహించాలని,నిషేదాలకు దూరంగా ఉండాలని ఆదేశించబడింది.
  2. నిషేదాజ్ఞలను ఆచరించడానికి ఎటువంటి సాకు లేదు,ఆదేశం శక్తికి పరిమితం చేయబడినది,ఎందుకంటే వదలడం సామర్థ్యం పై ఆధారపడింది,ఆదేశించబడిన విషయం కార్యరూపం దాల్చలంటే శక్తి,సామర్థ్యం యొక్క అవసరం ఉంటుంది.
  3. అధికంగా ప్రశ్నించడం వారించబడింది,ధార్మిక వేత్తలు ప్రశ్నలను రెండు రకాలుగా విభజించారు; ఒకటి – ధార్మిక పరమైన జీవనం కొనసాగించేందుకు కావల్సిన విధ్యను నేర్చుకోవడానికి చేయబడే ప్రశ్నలు-సహాబాల ప్రశ్నలు ఈ కోవకు చెందినవే,రెండు : ఇబ్బందులకు గురిచేయడానికి,కష్టపెట్టడానికి చేయబడే ప్రశ్నలు-వీటి గురించే ఇక్కడ వారించబడినది.
  4. దైవప్రవక్తను విబేధించకూడదని లేకుంటే గతించిన జాతులకు పట్టిన గతే ఈ ఉమ్మత్ కు పడుతుందని హెచ్చరించబడుతుంది
  5. నిషేదాజ్ఞలు ఎక్కువ మరియు తక్కువ తో ఇమిడి ఉంటుంది,ఎందుకంటే ఎక్కువైన తక్కువైన దూరంగా ఉన్నప్పుడే దాని అర్ధం పూర్ణమవుతుంది ఉదాహరణకు : వడ్డీ మాకు నిషేడించబడినది,అందులో ఎక్కువ,తక్కువ రెండు మోతాదులు కూడి ఉన్నాయి.
  6. హరాము కు గురిచేసే ప్రధాన కారణాలను త్యజించాలి,ఎందుకంటే అవి దూరంగా ఉండాలి అనే భావం లో ఇమిడి ఉన్నాయి
  7. ఒక వ్యక్తికి సామర్థ్యం మరియు శక్తి ఉంటాయి,వాక్యం ప్రకారం ‘("مَا استَطَعْتُمْ"){మీ శక్తి మేరకు}-ఇందులో జబరియ్య’ఆరోపణలకు కు జవాబు ఉంది,వారి ఆరోపణ: మనిషి కి ఎలాంటి సామర్థ్యం శక్తి ఉండవు,ఎందుకంటే అతను చేసే పనిపై బలవంతంగా నియమింపబడతాడు చివరకు అతను సంభాషిస్తూ కదిపే చేయికూడా బలవంతంగానే కడుపుతాడు,వారి మాట ప్రకారంగా ‘చేతిని కదపడం’కూడా అతని సామర్థ్యంలో లేదు,బలవంతంగా చేస్తున్నాడు,ఈ విషయం నిశ్చయంగా ఇది అబద్దం అనడంలో ఎలాంటి సంశయం లేదు,ఇది పెద్దపెద్ద సమస్యలకు తెరలేపుతుంది.
  8. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆదేశం విన్నతరువాత ఏ ఒక్కరికీ ఇలా:‘అది వాజిబా?లేక ముస్తహబ్బా’ అంటూ పలకడం సమంజసం కాదు.ప్రవక్త సందేశం” ఆజ్ఞాపించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి”{ "فَأْتُوا مِنْهُ مَا استَطَعْتُمْ". }
  9. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆదేశించిన విషయాలు మరియు వారించిన విషయాలు షరియతు శాసనాలు అవుతాయి,వాటి ప్రస్తావన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధం లో ఉన్నా,లేకున్నా సమానమే!,ఖుర్ఆన్ తో పాటుగా సున్నతులో గల ఆదేశాలపై,నిషేదాల పై కార్యాచరణగావించబడుతుంది.
  10. అధికప్రశ్నలు ’నాశనానికి దారి తీస్తాయి,ముఖ్యంగా అంతుచిక్కని ‘అగోచర విషయాల సంబంధిత ప్రశ్నలు ఉదాహరణకు: అల్లాహ్ కు చెందిన శుభనామాలు మరియు గుణగణాలు,పరలోక సంభందిత విషయాలు, మీరు ఇందులో అత్యధికంగా ప్రశ్నలకు పాల్పడకండి నాశనమవుతారు,కాబట్టి స్థిరంగా,విధేయునిగా ఉండండి.
  11. గతించిన జాతులు అత్యధికప్రశ్నల వల్ల నాశనం చేయబడ్డాయి,మరియు తమప్రవక్తలను ఎక్కువగా విభేదించడం వల్ల నాశనం చేయబడ్డారు.