హదీసుల జాబితా

: : .
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “@ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి*. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు*. అయితే అతడు దేనినైతే స్వర్గం అని అంటాడో (వాస్తవానికి) అది నరకం. కనుక నూహ్ అలైహిస్సలాం తన జాతి జనులను ఏ విధంగానైతే హెచ్చరించినాడో నేనూ ఆ విధంగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
... ...
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ఆచరించునపుడు (సజ్దాలో) తన రెండు చేతులను (నేలపై) తన శరీరపు రెండు ప్రక్కల నుండి దూరంగా ఉంచేవారు, ఎంతగా అంటే వారి చంకల తెల్లదనము కనిపించేది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
....
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి@. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము; *అలాగే నేను ఋతుస్రావము (బహిష్ఠు) స్థితిలో ఉన్నపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అంగవస్త్రము (షాల్ వంటిది) ధరించమని చెప్పి, నన్ను కౌగలించుకుని ముద్దులాడేవారు; అలాగే వారు మస్జిదులో ఏతికాఫ్ లో గడుపునపుడు – నేను బహిష్ఠు స్థితిలో ఉన్న సమయాన కూడా, వారు తన తలను (కిటికీ నుండి) ఇంటిలోనికి పెట్టేవారు , నేను వారి తలను కడిగేదానిని.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు*; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది*. తరువాత మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. తరువాత వలస వెళ్ళమని (అల్లాహ్ చే) ఆదేశించబడినారు. ఆయన మదీనా కు వలస వెళ్ళినారు. అక్కడ పది సంవత్సరాలు గడిపినారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమవదించినారు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "@నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి*. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్