عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدَ النَّاسِ، وَكَانَ أَجْوَدُ مَا يَكُونُ فِي رَمَضَانَ حِينَ يَلْقَاهُ جِبْرِيلُ، وَكَانَ يَلْقَاهُ فِي كُلِّ لَيْلَةٍ مِنْ رَمَضَانَ فَيُدَارِسُهُ القُرْآنَ، فَلَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدُ بِالخَيْرِ مِنَ الرِّيحِ المُرْسَلَةِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6]
المزيــد ...
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదార స్వభావి, రమదాన్ మాసంలో ఆయన దాతృత్వం మరింతగా పెరిగిపోయేది. తనను అర్థించిన వారికి ఏది అవసరమో దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చివేసేవారు. ఆయన దాతృత్వం అధికం కావడానికి రెండు విషయాలు కారణంగా ఉండేవి, అవి:
మొదటిది: జిబ్రీల్ (అలైహిస్సలాం) తో ఆయన సమావేశం కావడం;
రెండవ విషయం: కంఠస్థము చేసి, ధారణలో ఉంచుకున్న ఖుర్’ఆన్ ను పునశ్చరణ చేయడం.
జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ యొక్క అవతరించిన ప్రతి ఆయతును ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో అధ్యయనం చేసేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఉదారత్వముతో; అర్థించిన వారికి అర్థించిన దాని కంటే ఎక్కువ ప్రసాదిస్తూ, వీలైనంత ఎక్కువ మంచి చేస్తూ, అల్లాహ్ తన కరుణతో పంపే వర్షం మరియు మంచి గాలి కంటే వేగంగా ప్రజలకు మరింత త్వరగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండేవారు.