عن أنس بن مالك رضي الله عنه قال:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَحْسَنَ النَّاسِ خُلُقًا.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2310]
المزيــد ...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ ముస్లిం - 2310]
నైతిక విలువలు మరియు సత్శీలతకు సంబంధించింత వరకూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరిలోనూ అత్యుత్తమములు, అత్యంత పరిపూర్ణత గలవారు. వ్యక్తిత్వము మరియు మూర్తిత్వము పరంగా – ఉదాహరణకు కరుణపూరితమైన సంభాషణకు, మంచి పనులు చేయుటకు, దీప్తివంతమైన ముఖ వర్ఛస్సుకు మరియు ఎవరికైనా కీడు లేదా హాని తలపెట్టుటకు దూరంగా ఉండుట మరియు ఎవరైనా తనకు కీడు గానీ, హాని గానీ తలపెట్టితే దానిపై సహనం వహించుట మొదలైన గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథములు.