+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْلَا أَنْ أَشُقَّ عَلَى الْمُؤْمِنِينَ -أَوْ: عَلَى أُمَّتِي- لَأَمَرْتُهُمْ بِالسِّوَاكِ عِنْدَ كُلِّ صَلَاةٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 252]
المزيــد ...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నేను ముస్లిములపై ఎక్కువ భారం వేస్తున్నానేమో అనే సందేహం లేకపోయినట్లయితే (జుబైర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇదే హదీసులో “....నా ఉమ్మత్’పై ఎక్కువ భారం వేస్తున్నానేమో” అనే పదాలు ఉన్నాయి) నిశ్చయంగా ప్రతి నమాజు సమయాన ‘సివాక్’ (పలుదోము పుల్ల) వాడమని ఆదేశించి ఉండేవాడిని.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 252]

వివరణ

ఈ హదీథులో – తన ఉమ్మత్’ యొక్క విశ్వాసులపై భారంగా మారుతుందేమో అనే భయంగానీ లేకపోయినట్లయితే ప్రతి నమాజు కొరకు ‘సివాక్’ వాడడం విధిగావించి ఉండే వాడిని – అని తెలియజేస్తున్నారు.

من فوائد الحديث

  1. ఇందులో తన సమాజం పట్ల (తన ఉమ్మత్ పట్ల) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయ, కరుణ మరియు వారి పట్ల ఇబ్బందుల గురించి ఆయన భయపడటం కనిపిస్తుంది.
  2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశమునకు సంబంధించి ప్రాథమిక సూత్రం ఏమిటంటే అది వాజిబ్ కాదు ‘ఐచ్ఛికము’ (స్వచ్ఛంద ఆచరణ) అనే ఋజువు లభించేంత వరకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం “వాజిబ్” (తప్పనిసరిగా, విధిగా ఆచరించవలసినది) గానే భావించబడుతుంది.
  3. ఇందులో ప్రతి నమాజుకు ముందు ‘సివాక్’ ఉపయోగించడం మంచిది అనే వాంఛనీయత మరియు దాని ఘనత తెలియుచున్నది.
  4. ఇబ్న్ దఖిక్ అల్-ఈద్ ఇలా అన్నారు: నమాజు కొరకు లేచినపుడు సివాక్ ఉపయోగించాలి అనే సిఫారసు వెనుక ఉన్న తర్కము ఏమిటంటే, ఇది అల్లాహ్’కు ఒకరిని దగ్గరగా తీసుకు వచ్చే స్థితి. ఆ ఆరాధనను ఉన్నతం చేయడానికి, ఆ స్థితి పరిపూర్ణతను, స్వచ్ఛతను, పరిశుభ్రతను కోరుతుంది.
  5. ఈ హదీథులో సాధారణంగా అన్ని పరిస్థితులకు వర్తించేలా ఉన్న ఆదేశములో ఉపవాసము ఉన్న వ్యక్తి మధ్యాహ్నము మరియు సాయంత్రాలలో సివాక్ ను ఉపయోగించడం కూడా ఉన్నది, ఉదాహరణకు: జుహ్ర్ మరియు అస్ర్ నమాజు సమయాలలో.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية Юрба المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి