عَنِ ‌ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
أُنْزِلَ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ ابْنُ أَرْبَعِينَ، فَمَكَثَ بِمَكَّةَ ثَلَاثَ عَشْرَةَ سَنَةً، ثُمَّ أُمِرَ بِالْهِجْرَةِ، فَهَاجَرَ إِلَى الْمَدِينَةِ، فَمَكَثَ بِهَا عَشْرَ سِنِينَ، ثُمَّ تُوُفِّيَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది. తరువాత మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. తరువాత వలస వెళ్ళమని (అల్లాహ్ చే) ఆదేశించబడినారు. ఆయన మదీనా కు వలస వెళ్ళినారు. అక్కడ పది సంవత్సరాలు గడిపినారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమవదించినారు”.

దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దివ్య (ఖుర్’ఆన్) అవతరణ జరిగింది. అది వారు నలభై సంవత్సరాల వయసులో ఉండగా మొదలైంది. అవతరణ మొదలైన తరువాత వారు మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. అపుడు మదీనాకు వలస వెళ్ళమని ఆదేశించబడినారు. అక్కడ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరాలు గడిపినారు. తరువాత వారు అరవై మూడు సంవత్సరాల వయసులో పరమవదించినారు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర పట్ల సహబాల శ్రధ్ధ తెలుస్తున్నది.
ఇంకా