కూర్పు: అఖీద .
+ -

عن أبي ذر رضي الله عنه:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا رَوَى عَنِ اللهِ تَبَارَكَ وَتَعَالَى أَنَّهُ قَالَ: «يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي، وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا، فَلَا تَظَالَمُوا، يَا عِبَادِي كُلُّكُمْ ضَالٌّ إِلَّا مَنْ هَدَيْتُهُ، فَاسْتَهْدُونِي أَهْدِكُمْ، يَا عِبَادِي كُلُّكُمْ جَائِعٌ إِلَّا مَنْ أَطْعَمْتُهُ، فَاسْتَطْعِمُونِي أُطْعِمْكُمْ، يَا عِبَادِي كُلُّكُمْ عَارٍ إِلَّا مَنْ كَسَوْتُهُ، فَاسْتَكْسُونِي أَكْسُكُمْ، يَا عِبَادِي إِنَّكُمْ تُخْطِئُونَ بِاللَّيْلِ وَالنَّهَارِ وَأَنَا أَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا فَاسْتَغْفِرُونِي أَغْفِرْ لَكُمْ، يَا عِبَادِي إِنَّكُمْ لَنْ تَبْلُغُوا ضَرِّي فَتَضُرُّونِي، وَلَنْ تَبْلُغُوا نَفْعِي فَتَنْفَعُونِي، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوا عَلَى أَتْقَى قَلْبِ رَجُلٍ وَاحِدٍ مِنْكُمْ مَا زَادَ ذَلِكَ فِي مُلْكِي شَيْئًا، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوا عَلَى أَفْجَرِ قَلْبِ رَجُلٍ وَاحِدٍ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِي شَيْئًا، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ قَامُوا فِي صَعِيدٍ وَاحِدٍ فَسَأَلُونِي فَأَعْطَيْتُ كُلَّ إِنْسَانٍ مَسْأَلَتَهُ مَا نَقَصَ ذَلِكَ مِمَّا عِنْدِي إِلَّا كَمَا يَنْقُصُ الْمِخْيَطُ إِذَا أُدْخِلَ الْبَحْرَ، يَا عِبَادِي إِنَّمَا هِيَ أَعْمَالُكُمْ أُحْصِيهَا لَكُمْ ثُمَّ أُوَفِّيكُمْ إِيَّاهَا، فَمَنْ وَجَدَ خَيْرًا فَلْيَحْمَدِ اللهَ، وَمَنْ وَجَدَ غَيْرَ ذَلِكَ فَلَا يَلُومَنَّ إِلَّا نَفْسَهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2577]
المزيــد ...

అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి, ఓ నా దాసులారా! ఎవరికైతే నేను మార్గదర్శకత్వం చేసినానో, వారు తప్ప మిగిలిన వారందరూ మార్గభ్రష్ఠులైన వారే. కనుక నా నుంచి మార్గదర్శకత్వం కోరుకొండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను తినిపించినానో, వారు తప్ప మిగిలిన వారందరూ ఆకలితో అలమటించే వారే. కనుక నా నుండి పోషణ కోరుకొండి, నేను మీకు పోషణనిస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను వస్త్రాలను తొడిగించానో, వారు తప్ప మిగిలిన వారందరూ వివస్త్రులే, కనుక నా నుండి వస్త్రాలను కోరండి, నేను మీకు వస్త్రాలనిస్తాను. ఓ నా దాసులారా! నిశ్చయంగా మీరు రాత్రుల యందు, పగటియందు పాపకార్యాలకు పాల్బడతారు మరియు నేను మీ పాపాలనన్నింటినీ క్షమిస్తాను. కనుక పాపక్షమాపణ కొరకు నన్ను అర్థించండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా! ఒకవేళ మీరు నాకు ఏదైనా హాని కలిగించ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ హాని కలిగించలేరు. అలాగే ఒకవేళ మీరు నాకు ఏదైనా మంచిని కలుగజేయ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ మంచిని కలుగజేయలేరు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత దైవభీతి గల హృదయం మాదిరి – అత్యంత దైవ భీతి గలవారిగా, అత్యంత పవిత్రులుగా మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ జోడించదు, ఏమీ ఉన్నతం చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత హీనమైన, నీచమైన, పాపిష్ఠి హృదయం మాదిరి – అత్యంత పాపిష్ఠులుగా, నీచులుగా, మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ నష్టము, హాని కలిగించదు, ఏమీ తక్కువ చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులు – ఒకవేళ అందరూ కలిసి ఒక మైదానంలో నిలబడి, నన్ను అర్థిస్తే, నేను అందరికీ వారు కోరుకున్నదంతా ప్రసాదించినా, అది నా ఖజానా నుంచి, సముద్రంలో ముంచిన సూది మొన సముద్రం నుండి ఎంత నీటిని తగ్గిస్తుందో, అంత కూడా తగ్గించదు. ఓ నా దాసులారా! నిశ్చయంగా, అవి మీ కర్మలు మాత్రమే, వాటి కొరకు మీరు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు. అపుడు నేను మీకు దాని పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాను. కనుక ఎవరైనా మంచిని, శుభాన్ని సాధించినట్లయితే అందుకు అల్లాహ్ ను ప్రస్తుతించాలి మరియు ఎవరైనా చెడుకు పాల్బడితే అందుకు మరెవ్వరినో కాకుండా తనను తాను నిందించుకోవాలి.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2577]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) తనపై నిషేధించుకున్నాడు, అలాగే ‘జుల్మ్’ ను తన సృష్ఠిరాశులలో కూడా నిషేధించినాడు. కనుక ఏ ఒక్కరూ కూడా మరొకరిపై దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొదలైన వాటికి పాల్బడరాదు – అని తెలియజేస్తున్నారు. ఇంకా, కేవలం ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం గావించినాడో, వారు తప్ప సృష్ఠి మొత్తం కూడా సత్యమార్గం నుండి మార్గభ్రష్ఠులైన వారేనని, మరియు ఎవరైతే అల్లాహ్ ను సత్యమార్గం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగ జేయమని అర్థిస్తారో, అల్లాహ్ వారికి సత్యమారం వైపునకు మార్గదర్శక భాగ్యం కలుగజేస్తాడు అని తెలియ జేసినారు. అల్లాహ్ సమక్షంలో అందరూ పేదవారే, వారి ఏ ఒక్క అవసరం కొరకైనా అల్లాహ్ పై ఆధారపడి ఉన్న స్థితిలో ఉన్న వారే. ఎవరైతే తమ అవసరాల కొరకు అల్లాహ్ ను అర్థించినారో, అల్లాహ్ వారి అవసరాలను తీర్చినాడు మరియు అల్లాహ్ వారి అవసరాలు తీర్చేందుకు వారి కొరకు సరిపోతాడు. మానవులు రాత్రులయందు, పగటియందు కూడా పాపపు పనులకు పాల్బడతారు. మరియు ఎపుడైతే దాసుడు పాపక్షమాపణ కొరకు సర్వోన్నతుడైన అల్లాహ్ ను వేడుకుంటాడో, అల్లాహ్ అతడి పాపాలను కప్పివేస్తాడు, చూసీ చూడనట్లు వదిలివేస్తాడు మరియు క్షమిస్తాడు. మానవులు అల్లాహ్’కు ఏమీ ప్రయోజనం కలిగించలేరు. అలాగే ఎలాంచి హాని గానీ, నష్టము గానీ కలిగించలేరు. ఒక మానవుని అత్యంత దైవభీతి కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దైవభీతి గలవారిగా అయిపోయినా వారి దైవభీతి ఆయన ప్రభుతలో ఏమాత్రమూ వృధ్ధి చేయజాలదు. ఒక మానవుని అత్యంత దుష్ఠత్వము కలిగిన హృదయానికి మాదిరిగా, మానవులందరూ అత్యంత దుష్ఠులుగా అయిపోయినా వారి దుష్ఠత్వము ఆయన ప్రభుతలో ఏమాత్రమూ లోపము కలుగ చేయజాలదు మరియు నష్టపరుచజాలదు. ఎందుకంటే, వారంతా అల్లాహ్ సమక్షములో ఆశ్రితులు, నిరుపేదలు. వారు ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రతి చిన్న అవసరం కోసం ఆయనపై ఆధారపడవలసి ఉన్న స్థితిలో ఉన్నవారు. కేవలం ఆయన మాత్రమే సంపన్నుడు, అన్నిరకాల సంపదలకూ ప్రభువు. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి. మానవులూ మరియు జిన్నులూ, వారిలోని మొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు అందరూ ఒక మైదానం లో నిలబడి , తమ కోరికలు తీర్చమని అల్లాహ్ ను వేడుకున్నట్లయితే మరియు అల్లాహ్ వారందరూ కోరుకున్న ప్రతిదీ ప్రసాదించినట్లయితే, అది అల్లాహ్ వద్ద నున్న దానిని (సంపదను) ఏ మాత్రమూ తగ్గించదు, ఏవిధంగానైతే ఒక సూది మొనను సముద్రంలో ముంచి పైకి తీస్తే, అది సముద్రము నుండి ఏమీ తగ్గించలేదో ఆ విధంగా. ఇది అల్లాహ్ సుసంపన్నత యొక్క సంపూర్ణత్వము. సర్వ స్తోత్రములూ ఆయనకే చెందుతాయి అని తెలుపుతున్నది.
పరమ పవిత్రుడైన అల్లాహ్ తన దాసుల ఆచరణలను సురక్షితంగా ఉంచుతాడు మరియు వారి నుండి ఆ ఆచరణల లెక్క తీసుకుంటాడు. తీర్పు దినము నాడు వారికి వారి ఆచరణల ప్రతిఫలం అందజేస్తాడు. ఎవరైతే తన మంచి ఆచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని పొందుతాడో, అల్లాహ్ యొక్క విధేయతలో ఆ సత్కార్యాలను ఆచరించే భాగ్యాన్ని కలుగ జేసినందుకు అతడు అల్లాహ్ ను స్తుతించాలి. మరియు ఎవరైతే తన చెడు ఆచరణలకు మంచి ప్రతిఫలం గాక మరింకేదైనా పొందితే, అందుకు ఎవరినో కాకుండా అతడు తనను తానే నిందించుకోవాలి, ఎందుకంటే అందుకు కారణం అతడే కనుక.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية Малагашӣ ఇటాలియన్ Урумӣ Канада Озарӣ الأوزبكية الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ తన ప్రభువైన అల్లాహ్ నుండి నేరుగా ఉల్లేఖించిన హదీథు. ఇందులోని వాక్యాలు, అల్లాహ్ నేరుగా సంభాషిస్తున్నట్లుగా ఉంటాయి. ఇటువంటి హదీథులనుు 'హదీసుల్ ఖుద్సీ' అంటారు. ఇందులోని వచనము మరియు దాని అర్థము అల్లాహ్ తరఫు నుండి వచ్చినవై ఉంటాయి. అయితే 'హదీసుల్ ఖుద్సీకి, ఖుర్'ఆన్ కు ఉండేటువంటి అనుపమానమైన లక్షణాలు ఉండవు. ఖుర్'ఆన్ యొక్క అనుపమాన లక్షణాలు అంటే, ఉదాహరణకు, ఖుర్'ఆన్ యొక్క శైలి అనుపమానమైనది, అనుకరించ నలవి కానిది, ఖుర్'ఆన్ తన లోని సూరాలను (అధ్యాయాలను) పోలిన ఒక సూరా నైనా తయారు చేసి తీసుకు రమ్మని అవిశ్వాసులను సవాల్ చేస్తుంది - ఇటువంటి అనుపమానమైన లక్షణాలు ఖుర్'ఆన్ ను మరింకే విధమైన గద్యము / వచనము నుండి వేరు చేస్తాయి, ప్రత్యేకిస్తాయి. కనుక ఖుర్'ఆన్ ను భక్తి శ్రధ్ధాలతో పఠించాలి. ఖుర్'ఆన్ పఠించుటకు పరిశుద్ధత పాటించాలి (ఉదూ చేసుకుని ఉండుట) అనే నియమాలు 'హదీథ్ అల్ ఖుద్సీ' కి వర్తించవు.
  2. దాసులకు లభించే జ్ఞానము మరియు సన్మార్గము వైపునకు మార్గదర్శకము అనేవి కేవలం అల్లాహ్ తరఫు నుండే లభిస్తాయి.
  3. అతనికి కలిగే మంచి ఏదైనా అది అల్లాహ్ యొక్క దయ, అనుగ్రము కారణంగానే కలుగుతాయి. మరియు అతనికి కలిగే ఏ విధమైన ఇబ్బంది, ముప్పు, కష్టము, నష్టము మొదలైనవి అతని స్వయంకృతాల కారణంగా, అతని కోరికల కారణంగానే కలుగుతాయ.
  4. ఎవరైతే మంచిని చేస్తారో, అది అతనికి అల్లాహ్ కల్పించిన భాగ్యము కారణంగానే చేస్తాడు. దానికి తగిన ప్రతిఫలం అల్లాహ్ తరఫు నుండి లభిస్తుంది, అది అల్లాహ్ యొక్క ఘనత. ఎవరైతే (ఇతరులకు) కీడు తలపెడతాడో, హాని కలుగజేస్తాడో, దుష్కర్మలకు పాల్బడతాడో దానికి అతడు మరింకెవరినో కాకుండా తనను తానే నిందించుకోవాలి.
ఇంకా