+ -

عن ابن عباس رضي الله عنهما
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا يَرْوِي عَنْ رَبِّهِ عَزَّ وَجَلَّ قَالَ: قَالَ: «إِنَّ اللهَ كَتَبَ الْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ، ثُمَّ بَيَّنَ ذَلِكَ، فَمَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِهَا فَعَمِلَهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ عَشْرَ حَسَنَاتٍ إِلَى سَبْعِمِائَةِ ضِعْفٍ، إِلَى أَضْعَافٍ كَثِيرَةٍ، وَمَنْ هَمَّ بِسَيِّئَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِهَا فَعَمِلَهَا كَتَبَهَا اللهُ لَهُ سَيِّئَةً وَاحِدَةً».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6491]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు:
మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడు అయిన అల్లాహ్ నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పంపబడిన దాని నుండి వారు ఇలా ఉల్లేఖించినారు: “నిశ్చయంగా అల్లాహ్ మంచి పనులను గురించి, మరియు చెడు పనులను గురించి నమోదు చేసినాడు. తరువాత దానిని గురించి ఇలా విశదీకరించినాడు – ఎవరైతే ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకుంటాడో, మరి ఏదైనా కారణం వలన దానిని చేయలేక పోతాడో, అల్లాహ్ తన వద్ద, అతడి కొరకు ఆ మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు మరియు ఎవరైతే మంచి పని చేయాలని నిర్ణయించుకుని, ఆ పనిని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు పది నుండి మొదలుకుని ఏడు వందల రెట్లు ఎక్కువగా మంచి పనులు చేసినట్లు, ఇంకా దానికంటే కూడా ఎక్కువగా చేసినట్లు వ్రాస్తాడు. మరియు ఎవరైతే ఏదైనా చెడు పని చేయాలని సంకల్పించు కుంటాడో మరియు దానిని చేయకుండా ఉండి పోతాడో, అల్లాహ్ తన వద్ద అతడి కొరకు ఒక మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు. మరియు ఎవరైతే చెడు పని చేయాలని సంకల్పించుకుని ఆ పని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు ఒక చెడు పని చేసినట్లుగా వ్రాస్తాడు.

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6491]

వివరణ

ఈ హదీసులో – మంచి చెడుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ముందుగానే నిర్ణయించినాడని, వాటిని ఏవిధంగా గ్రంథస్థం చేయాలనే విషయాన్ని, (ప్రతి వ్యక్తితో పాటు ఎల్లప్పుడూ ఉండే) ఇద్దరు దైవ దూతలకు విశదీకరించినాడని – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు.
కనుక ఎవరైతే, ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, ఒకవేళ అతడు దానిని చేయలేకపోయినా అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు దానిని చేసినట్లయితే, పది రెట్ల నుండి ఏడు వందల రెట్ల వరకు, ఇంకా ఎక్కువ రెట్లు మంచి పనులు చేసినట్లుగా వ్రాయబడుతుంది. అయితే, పుణ్యఫలం ఎక్కువరెట్లు వ్రాయబడుట మరియు దానికి మించిన ప్రయోజనము అనేది అతడి హృదయంలో ఉన్న సంకల్పము యొక్క స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుంది.
మరియు ఎవరైతే, ఏదైనా చెడు పని చేయాలని ఆలోచన చేసి, సంకల్పము చేసి మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడు అయినట్లయితే, మరియు అతడు దానిని కేవలం అల్లాహ్ కొరకు చేయకుండా ఆగిపోయినట్లయితే, అతడి కొరకు ఒక మంచి పని చేసినట్లు వ్రాయబడుతుంది. మరియు దానిని చేయుట కొరకు కృతనిశ్చయుడై ఉండి, అతడు దాని కొరకు అవసరమైన వనరులు సమకూర్చుకొనకుండా ఉండిపోయినట్లయితే, అతడి కొరకు ఏమీ వ్రాయబడదు. ఒకవేళ అతడు అన్నీ సమకూర్చుకుని కూడా ఆ పని చేయలేక ఆగిపోయినట్లయితే, (ఆ విధంగా ఆగిపోవడానికి సంబంధించి) అతని మనసులో ఉన్న సంకల్పము ననుసరించి అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది. ఒకవేళ అతడు ఆ చెడు పని చేసినట్లయితే, అతడి కొరకు ఒక చెడుపని చేసినట్లుగా వ్రాయబడుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية ఇటాలియన్ Урумӣ Канада Озарӣ الأوزبكية الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో, ఈ ఉమ్మత్ పై (ముస్లిం జాతిపై) అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం తెలుస్తున్నది. ఆయన వద్ద మంచి పనుల ప్రతిఫలం ఎన్నో రెట్లు పెంచి రాయబడుతుంది, చెడు పనులు ఎన్నో రెట్లు పెంచి రాయబడవు (ఉన్నది ఉన్నట్లు గానే రాయబడుతుంది).
  2. అలాగే ఇందులో, ఆచరణలలో (వాటి వెనుక ఉండే) సంకల్పము యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావము స్పష్టంగా తెలుస్తున్నాయి.
  3. మహోన్నతుడు, సర్వ శక్తిమంతుడు అయిన అల్లాహ్ యొక్క కరుణ, దయ, దాతృత్వము, కనికరము ఎంత గొప్పవి అంటే కేవలం మంచి పని చేయాలనే స్వచ్ఛమైన సంకల్పము చేసినంత మాత్రమునే, ఆ పని చేయలేక పోయినను, ఆయన తన దాసుని కొరకు అతడు ఆ మంచి పనిని చేసినట్లుగా వ్రాస్తాడు.
ఇంకా