عن أبي موسى رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«إِنَّ اللهَ لَيُمْلِي لِلظَّالِمِ، حَتَّى إِذَا أَخَذَهُ لَمْ يُفْلِتْهُ» قَالَ: ثُمَّ قَرَأَ: «{وَكَذَلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَى وَهِيَ ظَالِمَةٌ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ}[هود: 102]»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4686]
المزيــد ...
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు.” అపుడు ఆయన (ప్రవక్త (స) ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.” (హూద్: 11:102)
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4686]
ప్రజల హక్కులు కాజేయుట, పాపకార్యాలకు పాల్బడుట, అల్లాహ్ కు సాటి కల్పించే పనులకు (షిర్క్ నకు) పాల్బడుట మొదలైన వాటిలో పడి ఉండుటను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో హెచ్చరించారు. నిశ్చయంగా అల్లాహ్ అటువంటి దుర్మార్గునికి ఇంకా గడువునిస్తాడు, అతని శిక్షను (త్వరగా విధించకుండా) ఆలస్యం చేస్తాడు, అతని వయస్సులో మరియు అతని సంపదలో వృద్ధినిస్తాడు, అతడిని శిక్షించుటలో త్వరపడడు. (అప్పటికీ) ఒకవేళ అతడు పశ్చాత్తాప పడకపోతే, అప్పటి వరకూ అతడు పాల్బడిన అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు ప్రతిగా అల్లాహ్ అతడిని పట్టుకుంటాడు, మరింక వదిలిపెట్టడు.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్’ఆన్ లోని ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది”. (హూద్: 11:102)