عن أبي هريرة رضي الله عنه: أن رسول الله صلى الله عليه وسلم قال:
«يَنْزِلُ رَبُّنَا تَبَارَكَ وَتَعَالَى كُلَّ لَيْلَةٍ إِلَى السَّمَاءِ الدُّنْيَا حِينَ يَبْقَى ثُلُثُ اللَّيْلِ الْآخِرُ، يَقُولُ: «مَنْ يَدْعُونِي فَأَسْتَجِيبَ لَهُ؟ مَنْ يَسْأَلُنِي فَأُعْطِيَهُ؟ مَنْ يَسْتَغْفِرُنِي فَأَغْفِرَ لَهُ؟».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1145]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1145]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వోన్నతుడు, సకల శక్తి సంపన్నుడు, పరమపవితృడైన అల్లాహ్ ప్రతి రాత్రి చివరి మూడవ భాగము మిగిలి ఉన్న సమయాన అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వస్తాడు. ఆయన తన దాసులను కోరుతాడు ఆ ప్రత్యేక సమయాన తనకు దుఆ చేయమని, తాను వారి దుఆలకు స్పందిస్తాను అని, అలాగే (ఆ ప్రత్యేక సమయాన) ఆలస్యం చేయకుండా తనను అడుగమని, తాను వారు కోరిన దానిని ప్రసాదిస్తాను అని, ఇంకా తన పాపాలను క్షమించమని (ఆ ప్రత్యేక సమయాన) తనకు మొరపెట్టుకోమని, తాను విశ్వాసులైన తన దాసులను క్షమిస్తానని.