+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: أَعْدَدْتُ لِعِبَادِي الصَّالِحِينَ، مَا لاَ عَيْنٌ رَأَتْ، وَلاَ أُذُنٌ سَمِعَتْ، وَلاَ خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ» قَالَ أَبُو هُرَيْرَةَ: اقْرَؤُوا إِنْ شِئْتُمْ: {فَلاَ تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِنْ قُرَّةِ أَعْيُنٍ} [السجدة: 17].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4779]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"పరమ పరిశుద్ధుడు మరియు మహిమాన్వితుడైన అల్లాహ్ ప్రకటన: 'నేను నా నీతిమంతులైన దాసుల కొరకు అంతకు ముందెన్నడూ ఎవరి కళ్లూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి హృదయాలూ ఊహించని వాటిని సిద్ధం చేసి ఉంచాను.' అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) అన్నారు: 'మీరు కోరితే ఈ ఆయతును పఠించండి: {ఏ ప్రాణికీ తన కొరకు దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు.} (సూరత్ అస్సజ్దా: 17)'"

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4779]

వివరణ

మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నీతిమంతులైన నా బానిసల కోసం నేను స్వర్గంలో ఎటువంటి గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని సిద్ధం చేశానంటే, దాని స్వరూపాన్ని ఎవరి కళ్ళూ చూడలేదు, ఎవరి చెవులూ వినలేదు, ఎవరి హృదయాలూ ఊహించలేదు." అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "మీరు కోరితే ఈ ఆయత్ని పఠించండి":
{فَلَا تَعْلَمُ نَفْسٌ مَّآ أُخْفِىَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍۢ} "ఏ ప్రాణికీ తన కోసం దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు." [అస్సజదహ్:17]

من فوائد الحديث

  1. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి చెప్పిన హదీథులలో ఒకటి. దీనిని హదీథు ఖుద్సీ లేదా దైవిక హదీథు అంటారు మరియు దాని పదాలు మరియు అర్థం అల్లాహ్ నుండి వచ్చాయి. అయితే, ఖుర్అన్‌ను ఇతర హదీథుల నుండి వేరు చేసే లక్షణాలు అంటే దాని పఠనం ఆరాధన కావడం, దాని ద్వారా శుద్ధి చేయడం, మార్గదర్శకం కావడం, అద్భుత స్వభావం కలిగి ఉండటం మొదలైన విషయాలు ఇందులో లేవు.
  2. అల్లాహ్ తన ఉత్తమ దాసుల కొరకు సిద్ధం చేసిన ప్రతిఫలాలు పొందేందుకు సత్కార్యాలు చేయడం, పాపాలను వదిలేయడం గురించి ప్రోత్సహించబడింది
  3. మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంథం (ఖుర్ఆన్) మరియు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల ద్వారా స్వర్గం గురించి మనకు కొన్ని విషయాలు మాత్రమే తెలియజేశాడు. మనకు తెలియని వాటి వైభవం, తెలిసిన వాటి కంటే ఎంతో గొప్పది!
  4. స్వర్గంలోని సుఖసౌఖ్యాల పరిపూర్ణత మరియు అక్కడి వాసులు పొందే నిర్మలమైన ఆనందం గురించి తెలుపబడింది.
  5. ఈ లోకపు సుఖాలు తాత్కాలికమైనవి, పరలోకమే (ఆఖిరత్) ఉత్తమమైనది, శాశ్వతమైనది."
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా