عن ابن مسعود رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم : «الجنة أقرب إلى أحدكُم من شِرَاكِ نَعْلِه، والنار مِثلُ ذلك».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు "మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు ‘స్వర్గం మీ చెప్పుగూడ కంటే కూడా మీకు అతి సమీపాన ఉంది,మరియు నరకం కూడా ఆ విధంగానే ఉంది"
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు : నిశ్చయంగా స్వర్గం మరియు నరకం మనిషికి అతి సమీపం లో ఉన్నాయి,పాదం పై భాగమంత దూరంలో,అనగా మనిషికి అవి అత్యంత సమీపం లో ఉన్నాయి,మనిషి కొన్ని సార్లు శక్తిమంతుడు మహోన్నతుడగు అల్లాహ్ ప్రసన్నత గైకొనుటకు ఒక సత్కార్యం చేస్తాడు అయితే దాని పుణ్యఫలం గురించి అంచనా వేసియుండడు,కానీ ఆ పుణ్యకార్యమే అతన్ని అనుగ్రహాలతో నిండిన స్వర్గానికి చేర్చుతుంది,మరికొన్నిసార్లు అతను అల్లాహ్ ఆగ్రహానికి లోనయ్యే పాపకార్యం చేస్తాడు దానివల్ల అతను వేల సంవత్సరాల దూరం గల నరకాగ్ని లోతుల్లోకి విసిరివేయబడతాడు,కానీ దాని గురించి అతనికి ఏమి తెలిసి ఉండదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. అల్లాహ్ యొక్క విధేయత స్వర్గం వైపుకు,ఆయనకు ఆవిధేయత పాపము నరకము వైపునకు చేరవేస్తాయి
  2. సంకల్పం శుద్దిగా ఉండి సదాచారణ గావించినట్లైతే స్వర్గాన్ని పొందటం చాలా తేలిక,
  3. పుణ్యం మరియు పాపము చిన్నవిషయాల్లోనే ఉంటాయి అందు చేత ప్రతీ వ్యక్తి ఏ సత్కర్యాన్ని చిన్నదిగా తలంచకుండా దాన్ని చేయాలి,అలాగే ఏ చిన్న తప్పుకైనా దూరంగా ఉండాలి.
  4. తక్కువ మేలుతో నిండిన సత్కర్మల సాధన వైపుకు అది ఎంత చిన్నదిగా ఉన్నాసరే చేయాలని ప్రోత్సహించబడుతుంది,చెడు ఎంత చిన్నదైనా సరే దాని నుండి హెచ్చరించడం జరుగుతుంది.
  5. శ్రోతలకు స్పష్టంగా అర్ధం చేరుకోవడానికి ఉపమానాలు ఉపయోగించడం జరుగుతుంది
ఇంకా