عَنْ عُبَادَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَأَنَّ عِيسَى عَبْدُ اللهِ وَرَسُولُهُ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَى مَرْيَمَ وَرُوحٌ مِنْهُ، وَالْجَنَّةُ حَقٌّ، وَالنَّارُ حَقٌّ، أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ عَلَى مَا كَانَ مِنَ الْعَمَلِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3435]
المزيــد ...
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 3435]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ క్రింది విషయాలు తెలుపుతున్నారు: ఎవరైతే తౌహీద్ వాక్యాలను, వాటి అర్థాన్ని, భావాన్ని బాగా అర్థం చేసుకుని, వాటిని ఉచ్చరిస్తాడో, మరియు వాటికి అనుగుణంగా ఆచరిస్తాడో, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు అని, ఆయన దాస్యానికి; మరియు ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు అని, ఆయన దౌత్యానికి సాక్ష్యం పలుకుతాడో; మరియు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడని, మరియు ఆయన సందేశహరుడని అంగీకరిస్తాడో, మరియు అల్లాహ్ ఆయనను (ఈసా అలైహిస్సలాం ను) కేవలం తన వాక్కు “కున్” (అయిపో) అనడం ద్వారా సృష్టించినాడని, ఆయన ‘అర్వాహ్’ (అల్లాహ్ సృష్టించిన ఆత్మలు ఉంచబడిన ప్రదేశం) లోని ఆత్మలలో ఒక ఆత్మ అని వాటిని అల్లాహ్ సృష్టించినాడని అంగీకరిస్తాడో, యూదులు ఆపాదించిన దాని నుండి (ఆరోపణ నుండి) ఆయన తన తల్లిని బయటకు తీసుకు వచ్చినాడని, స్వర్గము సత్యమని, మరియు నరకము సత్యమని, వాటి ఉనికి సత్యమని, అవి అల్లాహ్ ప్రసాదించే వరము (స్వర్గము), మరియు ఆయన విధించే శిక్ష (నరకము) అని విశ్వసిస్తాడో, మరియు దానిపైనే మరణిస్తాడో, అతని గమ్యస్థానము స్వర్గము – అతడు ఆచరణలలో తగినంత శ్రద్ధ చూపకపోయినా, పాపకార్యాలకు పాల్బడుతూ అవిధేయతకు పాల్బడినా కూడా.