హదీసుల జాబితా

నిశ్చయంగా ప్రజల్లో అత్యంత నీచులు ప్రళయం సంభవించు సమయాన జీవించియున్నవారు, సమాధులను వారు మస్జిదులుగా నిర్మించుకుంటారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవము లేడు ఆయన ఏకైకుడు అతనికి ఎవరు సాటి లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమిస్తూ దాంతో పాటూ మర్యం పుత్రుడైన ఈసాను అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడుగా,మర్యం వైపుకు పంపబడ్డ దైవవాక్యం గా,అల్లాహ్ తరుపున ఊదబడిన ఆత్మగా విశ్వసించి,స్వర్గ నరకాలు సత్యం అని భావించి ఎవరైతే సాక్ష్యామిస్తారో అల్లాహ్ సు త ఆ వ్యక్తి యొక్క కార్యాలు ఎలా ఉన్న అతన్ని స్వర్గం లోకి పంపిస్తాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా మీరు అతి త్వరలో మీ ప్రభువును కూడా ఈ రోజు నిండు చంద్రున్ని చూసినవిధంగానే చూస్తారు ‘ఎటువంటి తోపులాటలు లేకుండా చూస్తారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
عربي ఇంగ్లీషు ఉర్దూ
వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రళయదినపు సంకేతాలలో – ఙ్ఞానము (భూమి నుండి) లేపు కోబడుతుంది, అఙ్ఞానము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, వ్యభిచారము విపరీతముగా వ్యాప్తి చెందుతుంది, సారా త్రాగుట సర్వసాధారణం అవుతుంది, పురుషులు సంఖ్యలో తగ్గిపోతారు, అదే స్త్రీలు (సంఖ్యలో) పెరిగి పోతారు; ఎంతగా అంటే యాభై మంది స్త్రీలకు (వారి మంచి చెడులు చూడడానికి) ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు యూదులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. తన వెనుక దాగి ఉన్న యూదుని గురించి ఒక శిల “ఓ ముస్లిమా! ఓ యూదుడు నా వెనుక దాగి ఉన్నాడు. వాడిని సంహరించు” అని పలికేటంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఉమ్మత్ యొక్క చివరి కాలములో (ఉమ్మత్’లోని) కొందరు మీరు గానీ, మీ తాతముత్తాతలు గానీ ఎన్నడూ వినని హదీథులను మీకు చెబుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మరియు వారి పట్ల జాగ్రత్త వహించండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)
عربي ఇంగ్లీషు ఉర్దూ