عَنْ أَبِي ذَرٍّ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ مَا آنِيَةُ الْحَوْضِ؟ قَالَ: «وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَآنِيَتُهُ أَكْثَرُ مِنْ عَدَدِ نُجُومِ السَّمَاءِ وَكَوَاكِبِهَا، أَلَا فِي اللَّيْلَةِ الْمُظْلِمَةِ الْمُصْحِيَةِ، آنِيَةُ الْجَنَّةِ مَنْ شَرِبَ مِنْهَا لَمْ يَظْمَأْ آخِرَ مَا عَلَيْهِ، يَشْخَبُ فِيهِ مِيزَابَانِ مِنَ الْجَنَّةِ، مَنْ شَرِبَ مِنْهُ لَمْ يَظْمَأْ، عَرْضُهُ مِثْلُ طُولِهِ، مَا بَيْنَ عَمَّانَ إِلَى أَيْلَةَ، مَاؤُهُ أَشَدُّ بَيَاضًا مِنَ اللَّبَنِ، وَأَحْلَى مِنَ الْعَسَلِ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
"c2">“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను “మరి (నీటి హౌజు లోని ఆ నీటిని త్రాగే) కప్పుల మాటేమిటి?” దానికి ఆయన ఇలా అన్నారు: "c2">“ముహమ్మద్ యొక్క ప్రాణం ఎవరి చేతిలోనైతె ఉన్నదో ఆయన సాక్షిగా; మబ్బులు లేని నల్లని ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాల కన్నా, ఆ కప్పులు మిక్కిలి అధిక సంఖ్యలో ఉంటాయి. అవి స్వర్గపు పాత్రలు. ఎవరైతే దాని నుండి (ఆ నీటి హౌజు నుండి) నీటిని త్రాగుతాడో, అతడు ఇంకెన్నడూ దాహానికి లోను కాడు. అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని నుండి నీటిని త్రాగిన వారెవ్వరికీ తిరిగి దాహం వెయ్యదు. ఆ నీటి తొట్టి వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది; అమ్మాన్ మరియు ఆయిలహ్’ల మధ్య దూరమంత. దాని నీరు పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా మధురంగా ఉంటాయి”
.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్లాహ్ సాక్షిగా’ అని అల్లాహ్ పై ప్రమాణం చేసి నీటి హౌజు నుండి నీటిని త్రాగడానికి ఉపయోగించే గిన్నెలు ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే ఇందులో ‘నల్లని రాత్రి’ అన్నారు. అంటే అందులో చంద్రుడు ఉండడు. చంద్రుని కాంతితో నిండి ఉన్న ఆకాశం లో నక్షత్రాలు స్పష్టంగా కనిపించవు. చంద్రుడి కాంతి వెనుక అవి కప్పబడి ఉంటాయి. అలాగే ‘మబ్బులు లేని ఆకాశంలో’ అన్నారు. ఎందుకంటే మబ్బులు నక్షత్రాలను సరిగా కనిపించనీయవు. ఇంకా ‘స్వర్గపు పాత్రల’ (కప్పుల) ప్రస్తావన ఉంది. ఎవరైతే అందులో (స్వర్గములో ఆ పాత్రల నుపయోగించి) దేనినైతే త్రాగుతారో వారికి దాని దాహము ఇంకెన్నటికీ వెయ్యదు. ఆ విషయపు దాహానికి సంబంధించి అది ఆఖరిది అవుతుంది. (దాహార్తి అంతగా సంతుష్ఠుడు అవుతాడు అని అర్థము). అలాగే ఈ హదీసులో ఆ నీటి హౌజు గురించి, అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయని, దాని వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది అని తెలియ జేయబడింది. అలాగే ఆ నీటి హౌజు యొక్క అంచులు సమానంగా ఉంటాయని, దాని పొడవు షామ్ దేశంలోని ‘బఖా’ లో ఒక నగరమైన అమ్మాన్ నుండి, షామ్ దేశపు సరిహద్దులలో ఉన్న, ఒక ప్రఖ్యాత నగరమైన ‘అయ్’లహ్’ కి మధ్య దూరమంత ఉంటుందని (ఉపమానంగా) తెలుపబడింది. అలాగే ఆ నీటి హౌజులోని నీరు పాలకన్నా తెల్లగా ఉంటుందని, దాని రుచి తేనె కన్నా మధురంగా ఉంటుందని తెలియ జేయబడింది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. తీర్పు దినము నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక నీటి హౌజు (కొలను) ఉంటుంది అనడానికి మరియు దాని శుభాలను గురించి ఈ హదీసు ఒక సాక్ష్యము.
  2. దీని ద్వారా ఆ నీటి హౌజు ఎంత విశాలమైనదో, దాని పొడవు, వెడల్పులను గురించి మరియు అందు నుండి నీటిని త్రాగడానికి ఉపయోగించే పాత్రల గురించి తెలుస్తున్నది.
ఇంకా