عَنْ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَتْ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنِّي عَلَى الحَوْضِ حَتَّى أَنْظُرَ مَنْ يَرِدُ عَلَيَّ مِنْكُمْ، وَسَيُؤْخَذُ نَاسٌ دُونِي، فَأَقُولُ: يَا رَبِّ مِنِّي وَمِنْ أُمَّتِي، فَيُقَالُ: هَلْ شَعَرْتَ مَا عَمِلُوا بَعْدَكَ، وَاللَّهِ مَا بَرِحُوا يَرْجِعُونَ عَلَى أَعْقَابِهِمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6593]
المزيــد ...
అస్మా బింత్ అబీ బక్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నేను నీటి కొలనుపై ఉంటాను, ఆ విధంగా మీలో ఎవరు నా వద్దకు వస్తారో చూస్తాను. కానీ కొంతమంది ప్రజలు నావద్దకు రాకుండా దూరంగా నిలిపి వేయబడతారు. నేను “ఓ ప్రభూ! వారు నా వాళ్ళు, నా సమాజం (ఉమ్మత్) వాళ్ళు” అని వేడుకుంటాను. దానికి “నీకు తెలుసా, నీ తరువాత వీరు ఏమేం చేసినారో?” అని సమాధానం ఇవ్వబడుతుంది. అల్లాహ్ సాక్షిగా వాళ్ళు వేగంగా తమ మడమలపై వెనుదిరిగి పోతారు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6593]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - తీర్పు దినమునాడు, తన ఉమ్మత్ నుండి ఎవరెవరు నీటి తొట్టి వద్దకు వస్తారో చూడడానికి, తాను ఆ నీటి తొట్టి వద్దనే ఉంటాను అని తెలియ జేస్తున్నారు. కొంతమంది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దనుండి దూరంగా తీసుకు వెళ్ళబడతారు. అపుడు ఆయన “ఓ నా ప్రభూ! వారు నావాళ్ళు, నా ఉమ్మత్ వాళ్ళు” అని వేడుకుంటారు. అపుడు “నీ నుండి దూరమైన తరువాత (నీ తరువాత) వారు ఏమి చేసినారో తెలుసా నీకు? వారు తమ ధర్మాన్ని (ఇస్లాంను) వదిలి తమ పూర్వపు ధర్మానికి తిరిగి వెళ్ళినారు. వాళ్ళు నీ వాళ్ళు కాదు, నీ ఉమ్మత్ వాళ్ళూ కాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు చెప్పబడుతుంది.