عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ أَنْظَرَ مُعْسِرًا، أَوْ وَضَعَ لَهُ، أَظَلَّهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ تَحْتَ ظِلِّ عَرْشِهِ يَوْمَ لَا ظِلَّ إِلَّا ظِلُّهُ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1306]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”.
[దృఢమైనది] - - [سنن الترمذي - 1306]
ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక బాధపడుతున్న వానికి తగినంత సమయాన్ని ఇస్తాడో లేదా అతడి అప్పు నుండి కొంత భారాన్ని తగ్గిస్తాడో, అటువంటి వాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు: తీర్పు దినము నాడు, సూర్యుడు తన పూర్తి ప్రతాపముతో ప్రకాశిస్తూ, అల్లాహ్ యొక్క దాసుల తలలను తాకేటంత క్రిందకు వస్తాడు, ఆ వేడికి వారంతా తల్లడిల్లి పోతుంటారు. ఏ నీడా అందుబాటులో లేని అటువంటి కఠినమైన సమయాన, అల్లాహ్ అతడికి తన సింహాసనము క్రింద నీడను ప్రసాదిస్తాడు. కనుక, అల్లాహ్ ఎవరికైతే నీడను ప్రసాదిస్తాడో, వారికి తప్ప ఇంకెవ్వరికీ ఆనాడు నీడ దొరకదు.