+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَمَّا خَلَقَ اللَّهُ الْجَنَّةَ وَالنَّارَ أَرْسَلَ جِبْرِيلَ عَلَيْهِ السَّلَامُ إِلَى الْجَنَّةِ، فَقَالَ: انْظُرْ إِلَيْهَا وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا فَرَجَعَ، فَقَالَ: وَعِزَّتِكَ لَا يَسْمَعُ بِهَا أَحَدٌ إِلَّا دَخَلَهَا. فَأَمَرَ بِهَا فَحُفَّتْ بِالْمَكَارِهِ، فَقَالَ: اذْهَبْ إِلَيْهَا فَانْظُرْ إِلَيْهَا وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا، فَإِذَا هِيَ قَدْ حُفَّتْ بِالْمَكَارِهِ، فَقَالَ: وَعِزَّتِكَ لَقَدْ خَشِيتُ أَنْ لَا يَدْخُلَهَا أَحَدٌ. قَالَ: اذْهَبْ فَانْظُرْ إِلَى النَّارِ وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا فَإِذَا هِيَ يَرْكَبُ بَعْضُهَا بَعْضًا، فَرَجَعَ فَقَالَ: وَعِزَّتِكَ لَا يَدْخُلُهَا أَحَدٌ. فَأَمَرَ بِهَا فَحُفَّتْ بِالشَّهَوَاتِ، فَقَالَ: ارْجِعْ فَانْظُرْ إِلَيْهَا. فَنَظَرَ إِلَيْهَا فَإِذَا هِيَ قَدْ حُفَّتْ بِالشَّهَوَاتِ، فَرَجَعَ وَقَالَ: وَعِزَّتِكَ لَقَدْ خَشِيتُ أَنْ لَا يَنْجُوَ مِنْهَا أَحَدٌ إِلَّا دَخَلَهَا».

[حسن] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن أبي داود: 4744]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.

[ప్రామాణికమైనది] - - [سنن أبي داود - 4744]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రింది విషయాలు తెలియజేస్తున్నారు: అల్లాహ్ స్వర్గాన్ని మరియు నరకాన్ని సృష్టించినపుడు ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాం తో ఇలా అన్నారు “వెళ్ళు, వెళ్ళి స్వర్గాన్ని చూడు”. ఆయన వెళ్ళి స్వర్గాన్ని చూసి వచ్చాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దానిని గురించి, దానిలో ఉన్న సుఖాలూ, సంతుష్ఠి, గౌరవం, సంపదలూ మొదలైన వాటి గురించి విన్న వారెవరైనా అందులోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు. మరియు దాని కొరకు శ్రమిస్తారు”. అపుడు అల్లాహ్ స్వర్గాన్ని ఆయన ఆదేశాలను ఆచరించడంలోని కష్టాలతో; ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండలేని కష్టాలు, ఆకర్షణలు, మరియు కడగండ్లు చుట్టుకుని ఉండేలా చేసాడు. ఎవరైతే దానిలోనికి ప్రవేశించాలని కోరుకుంటారో వారు ఖచ్చితంగా వాటన్నింటినీ దాటవలసి ఉంటుంది. అపుడు అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం తో “ఓ జిబ్రయీల్! వెళ్ళు, ఇపుడు కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉన్నస్వర్గాన్ని చూసిరా” అన్నాడు. ఆయన వెళ్ళి, దానిని చూసి తిరిగి వచ్చి ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను, నాకు భయంగా ఉంది, స్వర్గాన్ని చేరుకునే మార్గంలో, దానిని చుట్టుకుని ఉన్న కష్టాలు, బాధలు, కడగండ్లు మొదలైన వాటి కారణంగా ఎవరూ దానిలోనికి ప్రవేశించలేరేమో”. అదేవిధంగా, అల్లాహ్ నరకాన్ని సృష్టించినపుడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు” అన్నాడు. ఆయన వెళ్ళి దానిని చూసాడు. తిరిగి వచ్చి జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను, అందులో ఉన్న భయంకర శిక్షలు, హింస, దుఃఖము, దురవస్థ, పరాభవము, అవమానము మొదలైన వాటిని గురించి విన్న వారెవరైనా అందులోనికి ప్రవేశించడాన్ని ఏ మాత్రమూ ఇష్టపడరు, మరియు దానిలోనికి తీసుకుని వెళ్ళే ప్రతి కారణం నుండి దూరంగా ఉంటారు.” అపుడు మహోన్నతుడూ, మహోత్కృష్టుడు అయిన అల్లాహ్ నరకాగ్నిని వాంఛలు, కోరికలు, సౌందర్యాలతో ఆవరింపజేసాడు. అపుడు ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, నరకాగ్నిని ఒకసారి చూడు”. అపుడు జిబ్రీల్ వెళ్ళి నరకాగ్నిని చూసాడు. తిరిగి వచ్చి ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను. దానిని చూసి నేను భయపడ్డాను – దానిని చుట్టుకుని ఉన్న ఆకర్షణలు, వాంఛలు, కోరికల కారణంగా దానిలో పడిపోవడం నుండి ఎవరూ తప్పించుకోలేరు”.

من فوائد الحديث

  1. స్వర్గము మరియు నరకము అనేవి ఈ క్షణం కూడా ఉనికిలో ఉన్నాయని విశ్వసించాలి.
  2. అగోచర విషయాలను గురించి విశ్వసించుట, అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని నుండి తెలుపబడిన ప్రతి విషయాన్ని విశ్వసించుట విధి.
  3. ఈ ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కఠిన పరిస్థితుల పట్ల సహనం వహించుట యొక్క ఘనత తెలుస్తున్నది. ఎందుకంటే సహనం వహించుట స్వర్గానికి దారి తీసే మార్గాలలో ఒకటి.
  4. నిషేధించబడిన విషయాలనుండి దూరంగా ఉండుట యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది. ఎందుకంటే అలా దూరంగా ఉండకపోవడం నరకాగ్నికి దారితీస్తుంది.
  5. స్వర్గాన్ని కష్టాలు, బాధలు, కడగండ్లతో నింపడం, నరకాగ్నిని వాంఛలు, కోరికలు, ఆకర్షణలతో నింపడం అనేవి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరినైనా పరీక్షించడానికి, పరీక్షలు పెట్టడానికి అవసరమైన ఆవశ్యక విషయాలు.
  6. స్వర్గానికి చేరుకునే మార్గము ఈ ప్రపంచిక జీవితములో నుండే ఉంది – అది కఠినమైనది, శ్రమతో కూడుకుని ఉన్నది. దానికి ఎంతో సహనం, విశ్వాసము అవసరం. నరకానికి దారి తీసే మార్గము కోరికలు, వాంఛలు, ఆకర్షణలు మొదలైన వాటితో నిండి ఉన్నది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ الفولانية ఇటాలియన్ Урумӣ Канада الولوف البلغارية Озарӣ اليونانية الأوزبكية الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా