హదీసుల జాబితా

“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవము లేడు ఆయన ఏకైకుడు అతనికి ఎవరు సాటి లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమిస్తూ దాంతో పాటూ మర్యం పుత్రుడైన ఈసాను అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడుగా,మర్యం వైపుకు పంపబడ్డ దైవవాక్యం గా,అల్లాహ్ తరుపున ఊదబడిన ఆత్మగా విశ్వసించి,స్వర్గ నరకాలు సత్యం అని భావించి ఎవరైతే సాక్ష్యామిస్తారో అల్లాహ్ సు త ఆ వ్యక్తి యొక్క కార్యాలు ఎలా ఉన్న అతన్ని స్వర్గం లోకి పంపిస్తాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కొందరు అల్లాహ్ యొక్క సంపత్తిని న్యాయ విరుద్ధంగా (మూర్ఖంగా, లక్ష్యరహితంగా) వినియోగిస్తారు. తీర్పు దినమునాడు అటువంటి వారికి నరకాగ్నియే గతి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా
عربي ఇంగ్లీషు ఉర్దూ
“స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం
عربي ఇంగ్లీషు ఉర్దూ
వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(అల్లాహ్ ఆజ్ఞ లేకుండా వ్యాపించే) అంటువ్యాధి అనేది లేదు; పక్షులలో అపశకునం లాంటిది ఏమీ లేదు; గుడ్లగూబలోనూ అపశకునం ఏమీ లేదు; మరియు సఫర్ మాసములోనూ అపశకునం ఏమీ లేదు. అయితే, కుష్ఠువ్యాధిగ్రస్తుని నుండి దూరంగా ఉండండి, ఏవిధంగానైతే సింహం నుండి మీరు దూరంగా ఉంటారో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
(ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!)
عربي ఇంగ్లీషు ఉర్దూ