+ -

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَا أَبَا سَعِيدٍ، مَنْ رَضِيَ بِاللهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ نَبِيًّا، وَجَبَتْ لَهُ الْجَنَّةُ»، فَعَجِبَ لَهَا أَبُو سَعِيدٍ، فَقَالَ: أَعِدْهَا عَلَيَّ يَا رَسُولَ اللهِ، فَفَعَلَ، ثُمَّ قَالَ: «وَأُخْرَى يُرْفَعُ بِهَا الْعَبْدُ مِائَةَ دَرَجَةٍ فِي الْجَنَّةِ، مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ»، قَالَ: وَمَا هِيَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الْجِهَادُ فِي سَبِيلِ اللهِ، الْجِهَادُ فِي سَبِيلِ اللهِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1884]
المزيــد ...

అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది." అబూ సయీద్ దానితో ఆశ్చర్యపోయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: ఓ రసూలల్లాహ్! దానిని నా కొరకు పునరావృతం చేయండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా పునరావృతం చేసి, ఇంకా ఇలా పలికినారు: "స్వర్గంలో దాసుడి స్థానాన్ని వంద స్థాయిలు పెంచే మరొక విషయం కూడా ఉంది; ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం భూమ్యాకాశాల మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అతను ఇలా అడిగినారు: "ఓ రసూలల్లాహ్! అది ఏమిటి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ కొరకు ధర్మపోరాటం, అల్లాహ్ కొరకు ధర్మపోరాటం."

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1884]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హుకు ఇలా తెలియజేసినారు: "ఎవరైనా అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఆరాధ్యుడిగా, యజమానిగా, అధిపతిగా మరియు ఆజ్ఞాపకుడిగా అంగీకరిస్తే మరియు ఇస్లాం ధర్మాన్ని తన ధర్మంగా పూర్తిగా స్వీకరించి, దాని ఆజ్ఞలు, నిషేధాలన్నింటికీ లోబడి జీవిస్తే మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా అంగీకరించి, ఆయనపై అవతరించిన ప్రతిదాన్ని విశ్వసిస్తే, అలాంటి వ్యక్తి కొరకు స్వర్గం తప్పనిసరి అవుతుందనే హామీ ఉన్నది. అది విని అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఆశ్చర్యపోతూ, "ఓ రసూలల్లాహ్! దయచేసి మళ్ళీ చెప్పండి," అని అడిగారు. ప్రవక్త మళ్ళీ చెప్పారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: "ఇంకా ఒక గుణం ఉంది — దాని వలన అల్లాహ్ తన దాసుడిని స్వర్గంలో నూరు స్థాయిల పైకి ఎత్తుతాడు. ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం, ఆకాశం-భూమి మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అబూ సయీద్ రదియల్లాహు అన్హు: "అది ఏమిటి, ఓ రసూలల్లాహ్ ?" అని అడిగినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం."

من فوائد الحديث

  1. స్వర్గంలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి — అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాం ధర్మాన్ని తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా అంగీకరించడం.
  2. అల్లాహ్ కొరకు ధర్మపోరాటం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుస్తున్నది.
  3. అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వ్యక్తి కొరకు స్వర్గంలో అత్యున్నత స్థానం ఉంది.
  4. స్వర్గంలో అనేక స్థాయిలు, ఎన్నో ర్యాంకులు ఉంటాయి. వాటిలో, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వీరుల కోసం ప్రత్యేకంగా వంద (100) స్థాయిలు ఉన్నాయి.
  5. రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు మంచి విషయాలను, వాటి మార్గాలను, వాటి కారణాలను తెలుసుకోవడంలో గొప్ప ఆసక్తి, ఉత్సాహం కలిగి ఉండేవారు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా