+ -

عَنْ أَبَي قَتَادَةَ رضي الله عنه أنَّهُ طَلَبَ غَرِيمًا لَهُ، فَتَوَارَى عَنْهُ ثُمَّ وَجَدَهُ، فَقَالَ: إِنِّي مُعْسِرٌ، فَقَالَ: آللَّهِ؟ قَالَ: آللَّهِ؟ قَالَ: فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ سَرَّهُ أَنْ يُنْجِيَهُ اللهُ مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ فَلْيُنَفِّسْ عَنْ مُعْسِرٍ أَوْ يَضَعْ عَنْهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1563]
المزيــد ...

అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఒకసారి అబూ ఖతాదా (ర) తన వద్ద అప్పు తీసుకుని తనను తప్పించుకుని తిరుగుతున్న ఒక వ్యక్తిని వెతుకుతూ వెళ్ళి, చివరికి అతడిని కలిసినారు. అతడు: “నేను దివాళా తీసాను (మీ అప్పు తీర్చటానికి నా వద్ద ఏమీ లేదు) అన్నాడు. దానికి అబూ ఖతాదా “అల్లాహ్ సాక్షిగా చెప్పు, నీవు నిజంగా దివాలా తీసావా?” అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను” అన్నాడు. అపుడు అబూ ఖతాదా (ర) అన్నారు “నిశ్చయంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఎవరైతే తీర్పు దినము యొక్క శిక్షల నుండి అల్లాహ్ చేత రక్షించబడుటను ఇష్టపడతాడో, అతడు తన వద్ద అప్పు తీసుకుని, (వాస్తవంగా) దానిని తీర్చలేక పోతున్న వ్యక్తికి మరింత సమయం ఇవ్వడం ద్వారా లేదా ఇచ్చిన అప్పు నుండి కొంత తగ్గించడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1563]

వివరణ

అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) తన నుండి అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న ఒక వ్యక్తి కొరకు వెతక సాగినారు. చివరికి అతడిని కలిసినారు. అప్పు తీసుకున్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “నేను దివాలా తీసినాను, నా దగ్గర మీ అప్పు తీర్చడానికి డబ్బు లేదు.”
అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఆ వ్యక్తిని ‘తన దగ్గర డబ్బు లేదు’ అని అల్లాహ్ పై ఒట్టు వేసి చెప్పమన్నారు.
ఆ వ్యక్తి ‘తాను నిజం పలుకుతున్నాను’ అని అల్లాహ్ పై ఒట్టు వేసి చెప్పినాడు.
అపుడు అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ‘తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నాను అని ఇలా అన్నారు:
పునరుత్థాన దినము యొక్క బాధలు, కష్టాలు మరియు భయానక స్థితి నుండి అల్లాహ్ తనను రక్షిస్తాడని ఎవరైతే సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నారో; అతడు తన వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోతున్న వానికి మరింత గడువునివ్వడం ద్వారా, లేక ఇచ్చిన అప్పులో కొంత భాగాన్ని రద్దు చేయడం ద్వారా, లేక పూర్తిగా అప్పునే రద్దు చేయడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.

من فوائد الحديث

  1. ఈ హదీథులో రుణగ్రహీత తాను తీసుకున్న రుణం చెల్లించగలిగే వరకు అతనికి ఉపశమనం ఇవ్వమని లేదా అతని రుణంలో కొంత భాగాన్ని, లేదా రుణం మొత్తాన్నే క్షమించమని సిఫార్సు చేయబడింది.
  2. ఎవరైతే విశ్వాసులకు ఇహలోకపు కష్టాల నుండి, దుఃఖాల నుండి ఉపశమనం కలిగిస్తారో, వారికి పునరుత్థాన దినమున (అల్లాహ్) దుఃఖాల నుండి కాపాడతాడు, మరియు వారి ప్రతిఫలం వారు చేసిన సహాయానికి తగినదై ఉంటుంది.
  3. షరియత్ నియమం: స్వచ్ఛంద ఆచరణల కంటే విధిగా ఆచరించవలసిన ఆచరణలు ఉత్తమమైనవి.
  4. అయితే ఒక్కోసారి స్వచ్ఛంద ఆచరణలు విధి ఆచరణల కంటే ఉత్తమమైనవి అవుతాయి. రుణగ్రహీత రుణాన్ని క్షమించి వేయడం అనేది స్వచ్ఛంద ఆచరణ. మరియు అతడు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించే వరకు సహనం వహించడం, వేచి ఉండడం, అప్పు తీర్చమని అతణ్ణి పలుమార్లు గట్టిగా అడుగకుండా ఉండడం, ఇవి ఇక్కడ విధిగా ఆచరించవలసిన ఆచరణలు. ఈ సందర్భములో విధి ఆచరణల కంటే స్వచ్ఛంద ఆచరణే ఉత్తమమైనది.
  5. ఈ హదీథు ఎవరైతే తీసుకున్న అప్పు తీర్చలేక దివాలా తీసిపోయిన వ్యక్తిని గురించి. అతడు అప్పుతీర్చలేక పోవడానికి అతని వద్ద ఒక ప్రామాణికమైన కారణం ఉన్నది. కానీ డబ్బు ఉండీ కూడా తీసుకున్న అప్పును తీర్చకుండా వాయిదా మీద వాయిదా వేస్తూ ఉండే వాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ధనవంతుడు అప్పు తీర్చకుండా వాయిదా వేయడం – అది దౌర్జన్యం, దుష్టత్వం.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా