హదీసుల జాబితా

“(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”
عربي ఇంగ్లీషు ఉర్దూ
; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
“ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్