+ -

عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الذَّهَبُ بِالذَّهَبِ، وَالْفِضَّةُ بِالْفِضَّةِ، وَالْبُرُّ بِالْبُرِّ، وَالشَّعِيرُ بِالشَّعِيرِ، وَالتَّمْرُ بِالتَّمْرِ، وَالْمِلْحُ بِالْمِلْحِ، مِثْلًا بِمِثْلٍ، سَوَاءً بِسَوَاءٍ، يَدًا بِيَدٍ، فَإِذَا اخْتَلَفَتْ هَذِهِ الْأَصْنَافُ، فَبِيعُوا كَيْفَ شِئْتُمْ، إِذَا كَانَ يَدًا بِيَدٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1587]
المزيــد ...

ఉబాదహ్ బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — ఏదైనా ఒక రకము వస్తువుకు బదులుగా అదే రకము వస్తువు మార్పిడి చేసుకునేటప్పుడు, (ఇచ్చే దానికి మరియు పుచ్చుకునేదానికి) సరిసమాన పరిమాణంలో, ఆ మార్పిడి ప్రత్యక్ష్యంగా తక్షణమే జరగాలి. ఒకవేళ ఈ వస్తువులు వేర్వేరు రకాలకు చెందినవి అయితే, మీకు ఇష్టమైన విధంగా అమ్ముకోవచ్చు (ఉదాహరణకు బంగారాన్ని వెండితో మార్చుకోవడం), కానీ ఆ లావాదేవీ ప్రత్యక్షంగా తక్షణమే జరగాలి.

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1587]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రిబాకు అంటే వ్యాపారానికి సంబంధించిన ఆరు వస్తువుల సరైన అమ్మకం - కొనుగోలు పద్ధతిని వివరించారు (దీని వలన ఆ లావాదేవీలో వడ్డీ ప్రమేయం ఉండదు). అవి: బంగారం, వెండి, గోధుమ, బార్లీ, ఖర్జూరం, ఉప్పు. ఒకే రకమైన వస్తువులను కొనుక్కుంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు (ఉదా: బంగారాన్ని బంగారంతో, వెండిని వెండితో...) ఈ రెండు షరతులు తప్పకుండా పాటించాలి: మొదటిది: పరమాణంలో సమానత్వం: బంగారం మరియు వెండి వంటి బరువుతో కొలిచే వస్తువుల విషయంలో — బరువులో సమానత్వం ఉండాలి. గోధుమలు, బార్లీ, ఖర్జూరాలు, ఉప్పు వంటి కొలతతో కొలిచే వస్తువుల విషయంలో — కొలతలో సమానత్వం ఉండాలి. రెండవది: అమ్మేవాడు మరియు కొనేవాడు వస్తువు మార్పిడిని తక్షణమే చేయాలి, అంటే అమ్మకం - కొనుగోలు మాట జరుగుతున్న స్థలంలో తక్షణమే (కూర్చున్న చోటనే) వస్తు మార్పిడి జరగాలి. ఒకవేళ ఈ వ్యాపార వస్తువులు భిన్నంగా ఉంటే (ఉదాహరణకు బంగారాన్ని వెండికి లేదా ఖర్జూరాలను గోధుమకు అమ్మడం), ఆ అమ్మకం ఒక షరతుతో మాత్రమే అనుమతించబడుతుంది. వస్తు మార్పిడి ఒప్పంద సమయంలోనే తక్షణం జరగాలి. అలా తక్షణం చేయకపోతే, అది నిషేధించబడిన వడ్డీ వ్యాపారంగా పరిగణించబడుతుంది మరియు ఇద్దరూ (విక్రేత మరియు కొనుగోలుదారు) నిషేధించబడిన వడ్డీ (రిబా) పాపంలో పడిపోతారు.

من فوائد الحديث

  1. వడ్డీ (రిబా) వస్తువుల వివరణ మరియు వాటి సరైన అమ్మకం-కొనుగోలు ఎలా జరగాలో వివరించే విధానం.
  2. వడ్డీ ప్రమేయం ఉన్న వ్యాపారం నిషేధించబడింది.
  3. కరెన్సీ నోట్లు (డాలర్, యూరో, రియల్ మొదలైనవి) కూడా బంగారం, వెండి మొదలైన వాటికి వర్తించే రిబా (వ్యాపార) నియమాలకే లోబడి ఉంటాయి.
  4. రిబా (వ్యాపారానికి) సంబంధించిన ఆరు వస్తువుల అమ్మకం-కొనుగోలు నియమాలు: వ్యాపార వస్తువుల అమ్మకంలో 3 రకాల పరిస్థితులు ఉంటాయి: 1. ఒకే రకమైన వస్తువుల అమ్మకం. ఉదా: బంగారం-బంగారం, ఖర్జూరం-ఖర్జూరం. ఇందులో రెండు షరతులు ఉన్నాయి: పరిమాణంలో సమానత్వం (బరువు/కొలతలో) మరియు తక్షణ మార్పిడి (ఒప్పంద స్థలంలోనే). 2. ఒకే లక్షణం కలిగిన భిన్న వస్తువుల అమ్మకం. ఉదా: బంగారం-వెండి (రెండూ లోహాలు), గోధుమ-బార్లీ (రెండూ గింజలు). ఇందులో ఒక షరతు మాత్రమే ఉన్నది: తక్షణ మార్పిడి మాత్రమే తప్పనిసరి, పరిమాణంలో తేడా ఉండవచ్చు. 3. పూర్తిగా భిన్నమైన వస్తువుల అమ్మకం. ఉదా: బంగారం-ఖర్జూరం (లక్షణాలు & రకాలు పూర్తిగా భిన్నం). షరతులు: సమానత్వం లేదా తక్షణ మార్పిడి అవసరం లేదు, ఏ విధమైన నిబంధనలు లేకుండా అమ్మవచ్చు.
  5. పైన పేర్కొన్న ఆరు వ్యాపార వస్తువులకు సంబంధించని వాటి కొనుగోలు-అమ్మకం, లేదా వాటిలో ఒకటి సంబంధించినది మరియు మరొకటి సంబంధించనిది అయినప్పుడు — అటువంటి లావాదేవీలో ఎలాంటి షరతులు లేవు, తక్షణ ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం లేదు, సమానత్వం ఉండాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణ: బంగారం ద్వారా స్థిరాస్తి (ఇల్లు, భూమి) కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి