عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا أَسْفَلَ مِنَ الكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5787]
المزيــد ...
అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 5787]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను ఇలా హెచ్చరించారు — ఒకరు ధరించే క్రింది దుస్తులు అంటే ప్యాంటు, లుంగీ లేదా క్రింది దేహాన్ని కప్పే ఇతర వస్త్రాలు, వారి కాలిచీలమండలము కంటే దిగువగా వేలాడకూడదు. ఎవరైనా తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకుంటే, ఆ భాగం నరకాగ్నిలో పడుతుంది. ఇది అతడు చేసిన పనికి శిక్ష.