عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضيَ اللهُ عنهما قَالَ:
رَجَعْنَا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ مَكَّةَ إِلَى الْمَدِينَةِ حَتَّى إِذَا كُنَّا بِمَاءٍ بِالطَّرِيقِ تَعَجَّلَ قَوْمٌ عِنْدَ الْعَصْرِ، فَتَوَضَّؤُوا وَهُمْ عِجَالٌ، فَانْتَهَيْنَا إِلَيْهِمْ وَأَعْقَابُهُمْ تَلُوحُ لَمْ يَمَسَّهَا الْمَاءُ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَيْلٌ لِلْأَعْقَابِ مِنَ النَّارِ أَسْبِغُوا الْوُضُوءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 241]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా ఉదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (ఉదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) ఉదూ చేయండి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 241]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మక్కా నుండి మదీనాకు ప్రయాణించినారు. దారిలో వారు నీళ్ళున్న ప్రదేశాన్ని కనుగొన్నారు. దానితో సహాబాలలో కొంతమంది గబగబా వెళ్ళి అస్ర్ నమాజు కొరకు ఉదూ చేసుకున్నారు. అయితే వారి పాదాల వెనుక భాగము (మడమలు) నీరు చేరని కారణంగా పొడిగా కనిపించింది. దానితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూ చేసేటప్పుడు పాదాల వెనుక భాగాన్ని సరిగా కడుక్కోకుండా నిర్లక్ష్యం చేసిన వారికి అగ్నిలో శిక్ష మరియు వినాశనం ఉన్నాయి”. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షుణ్ణంగా ఉదూ పూర్తి చేయమని వారిని ఆదేశించినారు.