హదీసుల జాబితా

ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
వజూ భంగమైనప్పుడు(విరిగినప్పుడు) తిరిగి వజూ చేసేంత వరకు.మీలోని ఎవరి నమాజును కూడా అల్లాహ్ ఆమోదించడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి ఉదూ చేసి, ఒక గోరు పరిమాణంలో ఉన్న ఒక చిన్న భాగాన్ని తన పాదంలో కడగకుండా వదిలివేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని చూసి ఇలా అన్నారు: “వెళ్ళు, వెళ్ళి నీ ఉదూను సక్రమంగా ఆచరించు". అతడు మళ్ళీ ఉదూ చేసి సలాహ్ ఆచరించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ