عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«لَا يَقْبَلُ اللهُ صَلَاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6954]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6954]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత అనేది సలాహ్ ఆచరించుట కొరకు ఒక షరతు అని తెలుపుతున్నారు. కనుక ఎవరైతే సలాహ్ ఆచరించాలని సంకల్పిస్తాడో, అతడు అంతకు ముందు వుదూను భంగ పరిచే పనులలో దేనికైనా పాల్బడి ఉంటే, అతడు సలాహ్ ఆచరించడానికి వుదూ చేయుట అతని కొరకు విధి అవుతుంది.