హదీసుల జాబితా

ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి).
عربي ఇంగ్లీషు ఉర్దూ
హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి చేసినారు) ఉల్లేఖన: అతను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించగా చూసినారు. అపుడు ఆయన (ఉస్మాన్ రజియల్లాహు అన్హు) (ఆ నీటి పాత్ర నుండి) తన రెండు చేతులపై నీళ్ళను వొంపుకుని మూడు సార్లు బాగా కడిగినారు. తరువాత నీటిలో తన కుడి చేతిని వేసి, గుప్పెడు నీళ్ళతో తన నోటినీ మరియు ముక్కునూ శుభ్రపర్చుకున్నారు. తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడుగుకున్నారు, తన చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడిగినారు. తరువాత (తడి అరచేతులతో) తన తలను తుడిచినారు. తరువాత తన పాదాలను (చీలమండలాల వరకు) మూడు సార్లు కడిగినారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “ఇపుడు నేను ఏవిధంగా ఉదూ చేసినానో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా నేను చూసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని తెలిపినారు “@ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.*”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం* మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
: :
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది".
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పెద్ద పాపములకు దూరంగా ఉన్నట్లయితే; (ప్రతిదినము విధిగా ఆచరించే) ఐదుపూటల నమాజులు, ఒక శుక్రవారపు నమాజు నుండి మరో శుక్రవారపు నమాజు వరకు, అలాగే ఒక రమదాన్ మాసము నుండి మరో రమదాన్ మాసము వరకు – వీటి మధ్య జరిగే చిన్నచిన్న పాపాలకు అవి పరిహారంగా మారతాయి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది*. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు*. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను వారించిన విషయాలకు మీరు దూరంగా ఉండండి,ఆదేశించిన విషయాలను శక్తి మేరకు ఆచరించండి,యదార్థంగా మీ పూర్వపు జాతులవారు అధిక ప్రశ్నలతో వారి ప్రవక్తలను విభేదించినందువలన నాశనం చేయబడ్డారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు*. కనుక మీలో ఎవరూ కూడా అల్లాహ్ రక్షణలో ఉన్న వానికి ఏ విధంగానూ హాని తలపెట్టరాదు. ఎవరైతే హాని తలపెడతాడో, అతడిని అల్లాహ్ యొక్క ఆగ్రహం చుట్టుకుంటుంది. అతడు ముఖం మీద పడవేసి నరకాగ్ని లోనికి విసిరి వేయబడతాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “@ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.”* (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సలాతుల్ అస్ర్’ను (అస్ర్ నమాజును) ఆచరించుటలో త్వరపడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “@ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ తన కుటుంబంపై ఖర్చు చేస్తాడో, అది అతని కొరకు (అల్లాహ్ మార్గములో చేసిన) సత్కార్యముగా నమోదు చేయబడుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
القزع
عربي ఇంగ్లీషు ఉర్దూ
మూత్రబిందువుల నుండి పరిశుభ్రత వహించండి,ఎందుకంటే సమాధిలో జరిగే శిక్షలకు ప్రధానంగా ఇదే కారణమవుతుంది.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “@అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి* అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను.* “నుదురు (అలా అని ఆయన చేతితో తన ముక్కు వైపునకు సంజ్ఞ చేసినారు), రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, మరియు రెండు కాళ్ళ చివరలు (అంటే రెండు కాలివేళ్ళు); మరియు బట్టలను గానీ జుట్టును గానీ పైకి దోపుకోరాదని కూడా ఆదేశించబడినది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “@అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్*” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు ఇమామ్ ను ఏ స్థితిలో పొందుతారో అదే స్థితిలో ఇమాము ను అతను అనుసరించవలసి ఉంటుంది.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు*. “ఇన్నల్ హంద లిల్లాహి, నస్తయీనుహు, వ నస్తఘ్’ఫిరుహు, వ నఊజుబిహి మిన్ షురూరి అన్’ఫుసినా, మయ్యహ్’దిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్’లిల్ ఫలా హాదియలహు, వ అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. {యాఅయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, వ ఖలఖ మిన్’హా జౌజహా, వ బస్స మిన్’హుమా రిజాలన్ కసీరన్, వ నిసాఅన్, వత్తఖుల్లాహల్లజీ తసాఅలూనబిహి, వల్ అర్హామ్, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా}[సూరహ్ అన్ నిసా:1]; {యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి, వలా తమూతున్న ఇల్లా వ అన్’తుమ్ ముస్లిమూన్.} [సూరహ్ ఆలి ఇమ్రాన్:102]; {యా అయుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వఖూలూ ఖౌలన్ సదీదన్}; {“యుస్’లిహ్’లకుం ఆ’మాలకుం, వ యఘ్’ఫిర్’లకుం, జునూబకుం, వమన్’యుతిఇల్లాహ వ రస్సులహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా} [అల్ అహ్’జాబ్ 70, 71] (నిశ్చయంగా సకలస్తోత్రములూ, మరియు ప్రశంసలన్నియూ కేవలం అల్లాహ్ కొరకే, మేము అయనను మాత్రమే సహాయం కొరకు వేడుకుంటాము, మరియు మమ్ములను క్షమించమని ఆయను మాత్రమే వేడుకుంటాము, మాలోని కీడు నుండి ఆయన రక్షణ కోరుకుంటాము, ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడో, అతడిని ఎవరూ మార్గభ్రష్ఠుడిని చేయలేరు, మరియు ఎవరినైతే ఆయన మార్గభ్రష్ఠత్వములో వదిలివేసినాడో, ఎవరూ అతనికి సన్మార్గ దర్శకం చేయలేరు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడని మరియు ఆయన సందేశహరుడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. {ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు} [సూరతున్’నిసా 4:1]; { ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి} [సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3:102]; {ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి; ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు} [సూరతుల్ అహ్’జాబ్ 30:70,71]
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. :
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది*. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “@నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)*, వీటిల్లో ఏ ఒక్క దానిలోనూ ఏమీ ఎక్కువ చేయకపోయినా (ఎక్కువ ఏమీ ఆచరించకపోయినా) నేను స్వర్గం లోనికి ప్రవేశించగలనా?” దానికి ఆయన “అవును, ప్రవేశించగలవు” అన్నారు. దానికి అతడు “అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే ఏ ఒక్క విషయమూ ఎక్కువ చేయను (ఎక్కువ ఆచరించను)” అన్నాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి*, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా వుదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (వుదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) వుదూ చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో*, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను, కొంతమంది అష్’అరీ తెగ వారితో కలిసి, “మాకు సవారీ వాహనాలు (ఉదా: ఒంటెలు, గుర్రాలు మొ.) కావాలి” అని కోరుతూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినాము. ఆయన “అల్లాహ్ సాక్షిగా! మీరు సవారీ అయి వెళ్ళడానికి నేను ఏమీ ఇవ్వను, మిమ్ములను సవారీ చేయడానికి నావద్ద ఏమీ లేదు” అన్నారు. అల్లాహ్ కోరినంత కాలము మేము ఎదురు చూసాము. అపుడు వారి వద్దకు మూడు ఒంటెలు తీసుకురాబడినాయి. ఆ మూడు ఒంటెలను తీసుకు వెళ్ళమని ఆయన మమ్మల్ని ఆదేశించినారు. మేము వాటిని తీసుకుని వెళ్ళినాము. అపుడు మాలో కొందరు “అల్లాహ్ మనలను అనుగ్రహించడు, మనం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మనకు సవారీ సమకూర్చమని కోరినాము. కానీ ఆయన అల్లాహ్ పై ప్రమాణం చేసి మరీ మనకు సవారీ ఇవ్వను అని అన్నారు; కానీ తరువాత ఇచ్చినారు” అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి (మా మధ్య) జరిగిన విషయాన్ని వారికి తెలియజేసినాము. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకు సవారీలను నేను సమకూర్చలేదు; కానీ అల్లాహ్ సమకూర్చినాడు. @అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “శౌర్యపరాక్రమాలతో పోరాడేవాడు, జాత్యభిమానము తో పోరాడేవాడు మరియు ప్రదర్శనాబుధ్ధితో పోరాడేవాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు?’ అని ప్రశ్నించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “@వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను*”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా, ఎప్పుడైనా వుజూ చేసినపుడు అతడు ముక్కులోనికి నీరు ఎక్కించి, శుభ్రంగా చీదివేయాలి; కాలకృత్యాలు తీర్చుకొనునపుడు ఎవరైనా తన జననేంద్రియాలను చిన్నచిన్న రాళ్లతో శుభ్రపరుచు కునేట్లయితే అతడు బేసి సంఖ్యలో వాటిని ఉపయోగించాలి*; మీలో ఎవరైనా తన నిద్ర నుండి లేచినపుడు, వుదూ చేయుట కొరకు నీటి పాత్రలో చేతులు పెట్టడానికి ముందు, తన చేతులను కడుగుకోవాలి, ఎందుకంటే మీలో ఎవరికీ తెలియదు తన చేతులు రాత్రి ఎక్కడ గడిపాయో”; సహీహ్ ముస్లింలో ఈ పదాలున్నాయి: “మీలో ఎవరైనా తమ నిద్ర నుండి లేచినపుడు, చేతులను మూడు సార్లు కడుక్కోనంత వరకు, (వుజూ కొరకు) నీటి పాత్రలో చేతులను పెట్టకండి, ఎందుకంటే అతడికి తెలియదు తన చేయి రాత్రి ఎక్కడ గడిపిందో”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి*. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు కాలకృత్యములు తీర్చుకొనుటకు ఏదైనా ప్రదేశానికి (మరుగుదొడ్డికి) వెళ్ళినట్లయితే మీరు ఖిబ్లాహ్ వైపునకు మీ ముఖాన్ని గానీ లేక వీపును గానీ చేయకండి; తూర్పు వైపునకు గానీ లేదా పడమర వైపునకు గానీ చేయండి”*. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “మేము షామ్ (సిరియా) దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు ఖిబ్లహ్ వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. మేము వాటిపై మా దిశను మార్చుకుని కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారము, తరువాత అల్లాహ్’ను క్షమాపణ కోరుకునేవారము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరు కూడా మూత్రవిసర్జన చేయునపుడు పురుషాంగాన్ని కుడి చేతితో పట్టుకోకండి, మలవిసర్జన తరువాత శుభ్ర పరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించకండి, అలాగే (ఆహారపు లేదా నీటి) పాత్ర లోనికి ఊదకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరికీ భయం లేదా – ఒకవేళ అతడు (నమాజులో) ఇమాం కంటే ముందు తల పైకి ఎత్తితే అల్లాహ్ అతడి తలను గాడిద తలగా చేస్తాడని లేక అతడి ఆకృతిని గాడిద మాదిరిగా చేస్తాడని?”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు*; రుకూ కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకునపుడు మరియు రుకూ నుండి తల పైకి ఎత్తునపుడు అదే విధంగా పైకి ఎత్తేవారు. అపుడు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హంద్” అని పలికారు. అయితే సజ్దహ్’లో అలా చేసేవారు కాదు (చేతులను పైకి ఎత్తేవారు కాదు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు*; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “@అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి*”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను @‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి*, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).
عربي ఇంగ్లీషు ఉర్దూ
“*ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“జనాబత్” గుస్ల్ యొక్క విధానము:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు, తరువాత సలాహ్ కొరకు (నమాజు కొరకు) చేయు విధంగా వుదూ చేసేవారు, తరువాత సంపూర్ణంగా స్నానం చేసేవారు*. వారు తన చేతి వేళ్ళను తల వెంట్రుకల లోనికి జొప్పించి (వెంట్రుకల క్రింది) చర్మమంతా తడిసినది అని సంతృప్తి చెందే దాకా తడి చేసేవారు, తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేసేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరమూ ఒకే నీటి తొట్టి నుండి, ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
. : . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి@. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అమ్ర్ ఇబ్న్ అబీ హసన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానానం గురించి ప్రశ్నించడం నేను చూసాను. దానితో ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకు రమ్మని ఒకరికి పురమాయించారు.@దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు*. (ముందుగా) ఆయన ఆ నీటి పాత్రను వొంపి చేతులపై నీళ్ళు పోసుకుని, రెండు చేతులను మూడు సార్లు కడిగినారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా నీళ్ళు తీసుకుని నోటిలో పుక్కిలించి, (ముక్కు లోనికి నీళ్ళు ఎక్కించి) ముక్కును చీది (నోటినీ, ముక్కునూ) మూడు సార్లు శుభ్రపరుచుకున్నారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా (మూడు సార్లు) నీళ్ళు తీసుకుని ముఖాన్ని మూడు సార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేయి పెట్టి, నీటితో రెండు చేతులను మోచేతుల సమేతంగా రెండుసార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేతులు పెట్టి (తడి చేతులతో) తలను ఒకసారి మసాహ్ చేసినారు (తడిమినారు) – చేతులను తల ముందు భాగము నుండి వెనుకకు తీసుకు వెళ్ళి, వెనుకనుండి ముందుకు తెచ్చినారు. తరువాత పాదాలను చీలమండలముల వరకు కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్” స్థితికి (గుసుల్ తప్పనిసరిగా ఆచరించవలసిన స్థితికి) లోనయ్యాను. అక్కడ నీళ్ళు దొరకలేదు. దానితో నేను మట్టిలో జంతువు పొర్లిన విధంగా పొర్లాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పాను. అపుడు ఆయన ఇలా అన్నారు: @“నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా కంటే ముందు అల్లాహ్ ద్వారా ఏ ప్రవక్త కూడా తన జాతివారిలో నుండి ఆయన మార్గాన్ని అనుసరించే మరియు ఆయన ఆదేశాన్ని పాటించే శిష్యులు మరియు సహచరులు లేకుండా పంపబడలేదు*. వారు తమ తరువాత వచ్చిన వారితో తొలగించబడ్డారు. మరియు వారు (తరువాత వచ్చినవారు) చేయని పనులను గురించి మాట్లాడతారు మరియు చేయమని ఆదేశించని పనులను చేస్తారు. ఎవరైతే వారితో తన చేతితో పోరాడుతాడో అతడు విశ్వాసి. ఎవరైతే వారితో తన నాలుకతో పోరాడుతాడో అతడు విశ్వాసి, మరియు ఎవరైతే వారితో తన హృదయంతో పోరాడుతాడొ అతడు విశ్వాసి. ఇక దీనికి మించి ఆవ గింజంత విశ్వాసం కూడా లేదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను @ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: @“అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
"మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో*”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్లాహు అన్హు కలిసి ఇలా అడిగాను: “నాకు ఒక ఆచరణను గురించి తెలియ జేయండి, దేనిని నేను ఆచరించినట్లయితే దాని ద్వారా అల్లాహ్ నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడో” లేక బహుశా నేను ఇలా అన్నాను: “”అల్లాహ్ అమితంగా ఇష్టపడే ఆచరణలు ఏమిటి?” ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను, ఆయన మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు, నేను మూడోసారి మళ్ళీ ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను ఇదే విధంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించాను. దానికి ఆయన: @“అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు*”. మఅదాన్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “తరువాత నేను అబూ దర్దా రజియల్లాహు అన్హు ను కలిసాను. ఆయనను కూడా ప్రశ్నించాను. ఆయన కూడా సౌబాన్ రజియల్లాహు అన్హు పలికిన మాదిరిగానే పలికారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే తీర్పు దినము యొక్క శిక్షల నుండి అల్లాహ్ చేత రక్షించబడుటను ఇష్టపడతాడో, అతడు తన వద్ద అప్పు తీసుకుని, (వాస్తవంగా) దానిని తీర్చలేక పోతున్న వ్యక్తికి మరింత సమయం ఇవ్వడం ద్వారా లేదా ఇచ్చిన అప్పు నుండి కొంత తగ్గించడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి”* మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?*” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
عربي ఇంగ్లీషు ఉర్దూ
“శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం*; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే శుక్రవారమునాడు పరిపూర్ణంగా ఉదూ చేసుకుని, శుక్రవారపు నమాజుకు వెళ్ళి, ఇమాం యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) మౌనంగా ఉంటాడో, ఆ శుక్రవారానికీ మరియు రాబోయే శుక్రవారానికీ మధ్య అతని వలన జరిగే చిన్న చిన్న పాపాలన్నీ క్షమించివేయబడతాయి; అంతేకాకుండా దానికి మరో మూడు దినములు అదనంగా కలుపబడతాయి*. కాని (ప్రసంగం మధ్యలో) అతడు ఒక చిన్న గులకరాయిని తాకినా, అతడు వ్యర్థమైన పనిలో పాల్గొన్న వానిగా లెక్కించబడతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శిస్తారో, వారు అలా ఉదయం లేదా సాయంత్రం మస్జిదును సందర్శించిన ప్రతిసారీ అల్లాహ్ స్వర్గంలో అతనికి ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాడు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు*; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
: : . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. :
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి.* వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది).
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు*. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “ఓ రసూలల్లాహ్! మేము సముద్రంపై ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట పరిమితంగా మంచి నీళ్ళు తీసుకు వెళుతాము. మేము ఆ నీటితో ఉదూ గానీ, గుసుల్ గానీ చేసినట్లయితే (నీళ్ళు అయిపోయి) మేము దాహంతో బాధపడ వలసి వస్తుంది. మరి మేము సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయవచ్చునా?” దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. : .
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది)*.” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
. . :
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు*; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి*. ఒకవేళ అతడు 5 రకాతులు చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు అతడి నమాజు ను (సరి సంఖ్యగా) పరిపూర్ణం చేస్తాయి. ఒకవేళ అతడు నాలుగు (రకాతులు) చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు షైతానుకు పరాభవంగా మారుతాయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
(నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. : .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
: . :
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు*.” నేను అడిగాను “మరి నీవు ఎలా చేస్తూ ఉండేవాడివి?” అని. దానికి ఆయన “మాలో ప్రతి ఒక్కరికీ, భగ్నం కానంత వరకూ, ఒకసారి చేసిన ఉదూనే సరిపోయేది” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రతి ఏడు దినములలో (కనీసం) ఒక దినమున (వారానికొకసారి) తల మరియు శరీరమును (శుభ్రముగా) కడుగుతూ (తల) స్నానము చేయుట ప్రతి ముస్లిము పై విధి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)* ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “@ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
కొంతమంది మగవారు సహ్’ల్ బిన్ స’ఆద్ అస్’సఈదీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. వారు "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన వేదిక (మింబర్) దేనితో తయారు చేసి ఉంటారు" అనే విషయంలో వాదులాడుకోసాగినారు. వారు అతడిని దాని గురించి అడిగినారు. అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అది దేనితో తయారు చేయబడినదో నాకు తెలుసు, అది ఇక్కడికి తీసుకు రాబడి ఇక్కడ స్థాపించబడిన మొదటి రోజునే నేను దానిని చూసాను, (స్థాపించబడిన తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై మొదటిసారి కూర్చోవడం కూడా చూసాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఫలానా స్త్రీ ఇంటికి పంపారు. సహ్’ల్ ఆ స్త్రీ పేరును కూడా చెప్పారు. ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకుడిని "నేను (మస్జిదులో) ప్రజలను సంబోధించి ప్రసంగించ వలసి వచ్చినపుడు కూర్చోవడానికి గానూ ఎత్తైన ఒక వేదికను తయారు చేయమని" పురమాయించండి” అని చెప్పమని పంపినారు. ఆమె అతనిని (వడ్రంగి సేవకునికి) ఆ పని కొరకు పురమాయించింది. అతడు ఆ వేదికను, అల్-ఘాబా నుండి ‘తమరిస్క్’ వృక్షపు కలపను తెప్పించి దానిని తయారు చేసినాడు. ఆ మెంబర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపబడింది. వారు దానిని అదుగో ఇక్కడే స్థాపించమని అదేశించినారు. తరువాత (దాని మెట్లు ఎక్కి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైకి వెళ్ళడాన్ని, దానిపై ఆయన నమాజు ఆచరించడాన్ని చూసాను. దానిపై ఉండగా ఆయన (“అల్లాహు అక్బర్” అని) తక్బీర్ పలికి నమాజును ప్రారంభించి, దానిపై ఉండగానే రుకూ చేసినారు. తరువాత వారు అడుగులు వెనుకకు వేస్తూ వేదిక మెట్లుదిగి, మెట్ల ప్రక్కన సజ్దా చేసినారు. (రెండు సజ్దాలు చేసిన) తరువాత వారు తిరిగి మెట్లు ఎక్కి వేదికపైకి వెళ్ళినారు. (ఆ విధంగా) వారు నమాజును పూర్తిచేసి ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి “@ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు ఇలా పలికినారు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్*, అల్లాహుమ్మ, రబ్బనా లకల్ హందు, మిల్’అస్సమావాతి, వ మిల్ అల్ అర్ధి, వ మిల్ అమా షి’త మిన్ షైఇన్ బ’ద్” (తనను స్తుతించిన వారి స్తోత్రములను అల్లాహ్ విన్నాడు. ఓ అల్లాహ్! మా ప్రభువా! సకల స్తోత్రములూ నీ కొరకే, ఆకాశాన్ని నింపినంత, భూమిని నింపినంత మరియు ఆ తర్వాత నీవు కోరుకున్నంత స్తోత్రం నీకొరకే).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “*ప్రతి ఫర్జ్ సలాహ్ (నమాజు) తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు” (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, విశ్వ సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్తోత్రములూ ఆయనకు చెందినవే, ఆయన సర్వసమస్తము పై ఆధిపత్యము, అధికారము కలవాడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించదలిచిన దానిని ఎవరూ ఆపలేరు, నీవు ఆపివేసిన దానిని ఎవరూ ప్రసాదించలేరు. ఐశ్వర్యవంతునికి అతనిసంపద, నీకు వ్యతిరేకంగా దేనికీ పనికిరాదు.)”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “రబ్బిగ్'ఫిర్లీ, రబ్బిగ్’ఫిర్లీ” (ఓ నా ప్రభూ! నన్ను మన్నించు, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
. .
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. :
عربي ఇంగ్లీషు ఉర్దూ
. .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ చేతిలో పట్టు వస్త్రాన్ని, తన కుడి చేతిలో బంగారాన్ని పట్టుకుని, తన రెండు చేతులను పైకి ఎత్తి ఇలా అన్నారు: “@నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”*. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరలు ఉన్న అన్ని మాంసాహార జంతువులను మరియు పంజాలు, గోళ్ళు కలిగిన అన్ని పక్షులను తినడాన్ని నిషేధించారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
"దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు"
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి."* దానికి సాలిమ్ ఇలా చెప్పినారు: అబూ హురైరా రదియల్లాహు అన్హు వద్ద ఒక పొలం ఉండేది, అతను ఇలా చెప్పేవారు: "లేదా పొలం కాపాడే కుక్క అయితే కూడా (వ్యతిరేకం లేదు)."
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "@నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు."* అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది*; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
. : . : اللهم إني أستخيرك بعلمك وأستقدرك بقدرتك، وأسألك من فضلك العظيم، فإنك تقدر ولا أقدر، وتعلم ولا أعلم، وأنت علام الغيوب، اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني، ومعاشي، وعاقبة أمري أو قال: عاجل أمري وآجله، فاقدره لي ويسره لي ثم بارك لي فيه، وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري أو قال: في عاجل أمري وآجله، فاصرفه عني واصرفني عنه، واقدر لي الخير حيث كان، ثم أرضني قال: ويسمي حاجته. : . . . . . . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది."* అబూ సయీద్ దానితో ఆశ్చర్యపోయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: ఓ రసూలల్లాహ్! దానిని నా కొరకు పునరావృతం చేయండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా పునరావృతం చేసి, ఇంకా ఇలా పలికినారు: "స్వర్గంలో దాసుడి స్థానాన్ని వంద స్థాయిలు పెంచే మరొక విషయం కూడా ఉంది; ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం భూమ్యాకాశాల మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అతను ఇలా అడిగినారు: "ఓ రసూలల్లాహ్! అది ఏమిటి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ కొరకు ధర్మపోరాటం, అల్లాహ్ కొరకు ధర్మపోరాటం."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు."* ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".
عربي ఇంగ్లీషు ఉర్దూ
. . . . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’
عربي ఇంగ్లీషు ఉర్దూ
తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @"అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను."* మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు*. వారు ముందుగా మస్జిద్‌కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
"నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇంట్లో వారికి పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారు ఖర్బూజా లేదా ఖజూర్ పండ్లతో తయారైన 'ఫదీఖ్' అనే మద్యపానీయం త్రాగుతుండే వారు. ఒక రోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ప్రకటనకారుణ్ని పంపి ఇలా ప్రకటన చేయించినారు:@ 'జాగ్రత్తగా వినండి! మద్యం ఇప్పుడు నిషేధించబడింది.'* అది వినగానే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నన్ను చూసి ఇలా అన్నారు: 'బయటకి వెళ్లి దీన్ని పారేయ్.' నేను దాన్ని బయటకు తీసువెళ్ళి పారేశాను. అది మదీనా వీధుల్లో ప్రవహించింది." ఆ సమయంలో కొంతమంది ప్రజలు ఇలా ప్రశ్నించారు: 'కొంతమంది మద్యం తాగిన స్థితిలో చనిపోయారు. ఇప్పుడు నిషేధం వచ్చేసరికి అది వాళ్ల కడుపుల్లోనే ఉంది. మరి వారి సంగతి ఏమిటి?' అప్పుడు అల్లాహ్ నుండి ఈ వాక్కు అవతరించింది: "ఓ విశ్వాసులారా! విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు — వారు ఇంతకు ముందు తిన్న వాటి పట్ల (నిషేధం రాకముందు) ఏ పాపమూ ఉండదు - అల్లాహ్‌కు భయపడుతూ, విశ్వసిస్తూ, మంచి కార్యాలు చేస్తూ ఉండినంతవరకూ…" (సూరతుల్ మాయిదా 5:93)
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
"ఎవరైనా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు నిరంతరం అలా దూకుతూనే ఉంటాడు;* ఎవరైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా ఆ విషం అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే విషాన్ని అతడు నిరంతరం తాగుతూనే ఉంటాడు; ఎవరైనా కత్తితో లేదా ఇనుప వస్తువుతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అది అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే వస్తువుతో అతడు నిరంతరం తన పొట్టను గాయపరుస్తూనే ఉంటాడు."
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
"ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ* ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత.
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
. : :
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "@నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి*. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
.
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్
"కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్