عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا اغْتَسَلَ مِنَ الجَنَابَةِ، غَسَلَ يَدَيْهِ، وَتَوَضَّأَ وُضُوءَهُ لِلصَّلاَةِ، ثُمَّ اغْتَسَلَ، ثُمَّ يُخَلِّلُ بِيَدِهِ شَعَرَهُ، حَتَّى إِذَا ظَنَّ أَنَّهُ قَدْ أَرْوَى بَشَرَتَهُ، أَفَاضَ عَلَيْهِ المَاءَ ثَلاَثَ مَرَّاتٍ، ثُمَّ غَسَلَ سَائِرَ جَسَدِهِ، وَقَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ، نَغْرِفُ مِنْهُ جَمِيعًا.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 272]
المزيــد ...
విశ్వాసుల మాత (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు, తరువాత సలాహ్ కొరకు (నమాజు కొరకు) చేయు విధంగా వుదూ చేసేవారు, తరువాత సంపూర్ణంగా స్నానం చేసేవారు. వారు తన చేతి వేళ్ళను తల వెంట్రుకల లోనికి జొప్పించి (వెంట్రుకల క్రింది) చర్మమంతా తడిసినది అని సంతృప్తి చెందే దాకా తడి చేసేవారు, తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేసేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరమూ ఒకే నీటి తొట్టి నుండి, ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 272]
జనాబత్ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయాలని సంకల్పించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా రెండు చేతులను కడుక్కోవడంతో ప్రారంభించేవారు. తరువాత నమాజు కొరకు చేసిన విధంగా వుదూ చేసేవారు, తరువాత తన శరీరముపై నీళ్ళు పోసుకునే వారు, తరువాత తడి చేతుల వేళ్ళను తన తల వెంట్రుకలలోనికి జొప్పించి తల వెంట్రుకల మొదళ్ళ వరకు నీళ్ళు చేరాయని, తల చర్మమంతా బాగా తడిసిందని తృప్తి చెందే వరకు వేళ్ళతో మర్దన చేసేవారు. తరువాత వారు తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత మిగతా శరీరమంతా నీళ్ళు పారించి స్నానం చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: ‘నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే నీటి తొట్టి నుండి ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”