عن أبي هريرة قال: قال رسول الله صلى الله عليه وسلم:
«حَقٌّ عَلَى كُلِّ مُسْلِمٍ أَنْ يَغْتَسِلَ فِي كُلِّ سَبْعَةِ أَيَّامٍ يَوْمًا، يَغْسِلُ فِيهِ رَأْسَهُ وَجَسَدَهُ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , "c2">“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ప్రతి ఏడు దినములలో (కనీసం) ఒక దినమున (వారానికొకసారి) తల మరియు శరీరమును (శుభ్రముగా) కడుగుతూ (తల) స్నానము చేయుట ప్రతి ముస్లిము పై విధి.”

దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ప్రతి ఏడు దినములలో కనీసం ఒక దినమున, యుక్త వయస్సుకు చేరి, మతిస్థిమితం కలిగిన, ప్రతి ముస్లిం తప్పనిసరిగా (విధిగా) తలస్నానము చేయాలి. ఆ దినమున అతడు శరీరముతో పాటు తలను కూడా శుభ్రముగా కడగాలి. ఆ స్నానము పరిశుద్ధతను పొందే సంకల్పముతో చేయాలి. ఈ (ఏడు) దినములలో మొదటి దినము – వేరే ఉల్లేఖనాలలో వచ్చిన విధంగా – శుక్రవారము. (హదీసులో ‘విధిగా’ ఆచరించాలి అనే అర్థములో పదములు ఉన్నాయి. అయినా) గురువారము నాడు స్నానం చేసి ఉన్నప్పటికీ శుక్రవారపు నమాజు కంటే ముందు తలస్నానము చేయుట ‘ముస్తహబ్ ముఅక్కిదహ్’ (నొక్కి చెప్పబడిన అభిలషణీయమైన ఆచరణ; కాని తప్పనిసరి విధి కాదు). ఇమాం బుఖారీ సేకరించిన ఒక హదీథు ద్వారా మనకు ఈ విషయం అర్థమవుతున్నది. అందులో ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: "c2">“ప్రజలు తమ జీవనోపాధి కొరకు (వివిధ రకాల) పనులు చేయడానికి వెళ్ళేవారు. జుమా నమాజు కొరకు (పనులనుండి నేరుగా) అదే స్థితిలో మస్జిదుకు వెళ్ళేవారు. అపుడు వారితో “స్నానం చేసి వస్తే మంచిది’ అని చెప్పబడినది.” ఇదే విషయానికి సంబంధించి మరొక ఉల్లేఖనలో ‘ప్రవక్త సహచరులు శ్రామికులు, వారి (శరీరం) నుండి చెమట వాసన వస్తూ ఉండేది. అందుకని వారికి "c2">“స్నానం చేసి వస్తే మంచిది’ అని చెప్పబడింది” అని ఉన్నది. అది వారి స్థితిని ఉన్నత పర్చడానికి సముచితమైనది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో మనకు పరిశుభ్రత మరియు స్వచ్ఛత పట్ల ఇస్లాం యొక్క శ్రద్ధ మరియు ఆసక్తి తెలుస్తున్నాయి.
  2. శుక్రవారము నాడు నమాజు కొరకు తల స్నానము చేయుట ‘నొక్కి చెప్పబడిన ముస్తహబ్ ఆచరణ’
  3. హదీసులో శరీరము కడుగుట పేర్కొనబడినప్పటికీ, తల కడుగుట ప్రత్యేకంగా పేర్కొనబడినది, కారణం శరీరముతో పాటు తలను కడుగుట పట్ల కూడా శ్రద్ధ వహించమని.
  4. ఒకవేళ ఎవరి నుండైనా అప్రీతికరమైన వాసన వస్తూ ఉండి, ఇతరులకు అసౌకర్యం కలిగేలా ఉంటే అలాంటి వ్యక్తి ‘గుసుల్’ (స్నానం) చేయడం తప్పనిసరి అవుతుంది (వాజిబ్ అవుతుంది).
  5. గుసుల్ చేయుట యొక్క ఘనత పొందుట కొరకు నిర్దేశించబడిన దినము శుక్రవారము.
ఇంకా