عن عَبْدِ اللهِ بْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ:
«مَنْ جَاءَ مِنْكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 894]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 894]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారపు నమాజుకు రావాలనుకునే వారు ‘జనాబత్ గుస్ల్’ చేసిన మాదిరిగా గుస్ల్ చేయాలని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘జనాబత్ గుస్ల్’ అంటే సంభోగానంతరం చేయు తలస్నానం.