+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنِ اغْتَسَلَ يَوْمَ الجُمُعَةِ غُسْلَ الجَنَابَةِ ثُمَّ رَاحَ، فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ، فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ، فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ، فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً، وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الخَامِسَةِ، فَكَأَنَّمَا قَرَّبَ بَيْضَةً، فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ المَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 881]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 881]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారము నాడు ‘శుక్రవారపు నమాజు’ కొరకు తొందరగా వెళ్ళుట ఎంత ఘనత కలిగిన విషయమో తెలియజేస్తున్నారు. ‘శుక్రవారపు నమాజు’ కొరకు మస్జిదునకు త్వరగా వెళ్ళుట అనేది సూర్యుడు పూర్తిగా ఉదయించిన వెంటనే ప్రారంభమై, ఇమాం మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు ఉంటుంది. ఈ సమయం మొత్తం ఐదు ఘడియలుగా ఉంటుంది. సూర్యుడు ఉదయించిన దగ్గరి నుండి ఇమాం మస్జిదులోనికి ప్రవేశించి ప్రసంగము ఇవ్వడానికి ‘మెంబరు’ (ప్రసంగ స్థలము) పై ఆశీనుడు అయ్యే వరకు మధ్యలో ఉన్న సమయం ఐదు భాగాలుగా విభజింపబడుతుంది.
మొదటిది: ఎవరైతే ‘జనాబత్ గుస్ల్’ మాదిరిగా సంపూర్ణంగా ‘గుస్ల్’ చేసి (తలస్నానం చేసి), శుక్రవారపు నమాజు కొరకు ప్రత్యేకించబడిన మస్జిదునకు మొదటి ఘడియలో వెళతాడో, అతడు ఒక ఒంటెను (అల్లాహ్ ప్రసన్నత కొరకు) దానం చేసిన వానితో సమానం.
రెండవది: ఎవరైతే రెండవ ఘడియలో వెళతాడో, అతడు ఒక ఆవును దానం చేసిన వానితో సమానం.
మూడవది: ఎవరైతే మూడవ ఘడియలో వెళతాడో, అతడు కొమ్ములు కలిగిన ఒక మగ పొట్టేలును దానం చేసిన వానితో సమానం.
నాలుగవది: ఎవరైతే నాలుగవ ఘడియలో వెళతాడో, అతడు ఒక కోడిని దానం చేసిన వానితో సమానం.
ఐదవది: ఎవరైతే ఐదవ ఘడియలో వెళతాడో, అతడు ఒక గుడ్డును దానం చేసిన వానితో సమానం.
ఎపుడైతే ఇమాం ‘ఖుత్బాహ్’ (శుక్రవారపు ప్రసంగం) ఇవ్వడానికి మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, మస్జిదు ద్వారముల వద్ద కూర్చుని ఉన్న దైవదూతలు – ఒక్కొక్కరుగా మస్జిదులోనికి ప్రవేశిస్తున్న వారి పేర్లను రాయడం ఆపి – అల్లాహ్ యొక్క స్మరణను, మరియు ప్రసంగాన్ని వినడానికి మస్జిదులోనికి వెళ్ళిపోతారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الصربية الرومانية Малагашӣ Канада
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇందులో శుక్రవారము నాడు, నమాజు కొరకు వెళ్ళడానికి ముందు సంపూర్ణంగా గుస్ల్ ఆచరించడం ప్రోత్సహించబడింది.
  2. శుక్రవారము నాడు మస్జిదునకు త్వరగా వెళ్ళుట యొక్క ఘనత మొదటి ఘడియ నుండే ప్రారంభమవుతుంది.
  3. మంచి పనులు చేయుటకు ముందడుగు వేయాలని ఈ హదీథులో ప్రోత్సాహం, హితబోధ ఉన్నది.
  4. ఈ హదీథు ద్వారా – దైవదూతలు శుక్రవారపు నమాజునకు హాజరవుతాని, ఇమాం యొక్క ఖుత్బా వింటారని తెలియుచున్నది.
  5. దైవదూతలు మస్జిదు యొక్క ద్వారముల వద్ద ఉంటారు – శుక్రవారపు నమాజు కొరకు ఎవరెవరు ముందుగా వచ్చినారో నమోదు చేస్తూ ఉంటారు.
  6. ఇమాం ఇబ్న్ రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో “ఎవరైతే శుక్రవారము నాడు గుస్ల్ ఆచరించి మస్జిదుకు బయలుదేరతారో....” అనే మాటలు, శుక్రవారము నాటి ప్రత్యేక గుస్ల్ సమయం సూర్యుడు ఉదయించినప్పటి నుండి మొదలై, అతడు మస్జిదునకు బయలుదేరే ముందు వరకు ఉంటుంది అనే విషయాన్ని సూచిస్తున్నాయి.