عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «أقْرَبُ ما يَكون العبد مِنْ رَبِّهِ وهو ساجد، فَأَكْثروا الدُّعاء».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘దాసుడు తన ప్రభువుకు ‘సజ్దా స్థితిలో ఉన్నప్పుడూ’అతిసమీపంగా ఉంటాడు కాబట్టి మీరు ఆ స్థితిలో ఎక్కువగా దుఆ చేస్తూ ఉండండి
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు : " దాసుడు సాష్టాంగ పడేటప్పుడు తన ప్రభువుకు అతి దగ్గరగా ఉంటాడు". కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి సాష్టాంగ పడినప్పుడు, అతను తన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాన్ని ప్రజలు తమ పాదాలతో రుద్దేసే ప్రదేశంలో ఉంచుతాడు. అదే విధంగా అతని శరీరం యొక్క పై భాగాన్ని శరీరం యొక్క దిగువ భాగానికి సమానంగా ఉంచుతాడు.అంటే, అతని ముఖం శరీరం యొక్క ఎత్తైన భాగం మరియు అతని రెండు కాళ్ళు శరీరం యొక్క అడుగు భాగం. అతను తన ముఖాన్ని మరియు పాదాలను మహోన్నతుడైన అల్లాహ్ ముందు వినయ విధేయతలతో సమతుల్యతలో ఉంచుతాడు. అందుకే అతను సాష్టాంగంలో తన ప్రభువుకు దగ్గరగా ఉంటాడు. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాష్టాంగంలో సజ్దాలో అధికంగా దుఆ చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంలో, దాసుడి బాహ్యరూపము మరియు అతని ప్రార్థన ప్రభువుకు వినయంగా విధేయత చూపుతుంది.అందుకే సజ్దాలో దాసుడు ఇలా పలుకుతాడు : సుబ్’హన రబ్బీయల్ ఆలా’ఇది అల్లాహ్ యొక్క ఉనికిలో మరియు గుణాల్లోని గొప్పతనం ఉన్నతమైనదని సూచిస్తుంది.సర్వశక్తిమంతుడు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క గొప్పతనం ఎదుట మానవుడు చాలాహీనమైనవాడు మరియు బలహీనమైనవాడు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. సజ్దాలో అధికంగా దుఆ చేయడం ముస్తహబ్ కార్యం ఎందుకంటే ఇది దుఆ స్వీకరించబడే ప్రదేశాలలో ఒకటి
  2. దాసుడిని మహోన్నతుడు పరమపవిత్రుడు అయిన అల్లాహ్ యొక్క సామీప్యతకు దరిచేయడంలో ‘విధేయత’దోహదపడుతుంది.
  3. దాసుడు విధేయతలో అబివృద్దిని సాదించినప్పుడల్లా అల్లాహ్ అతని ప్రార్ధనలు స్వీకరిస్తాడు.
  4. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారికి ఉమ్మత్ కు మేలైన విద్యాభోదన పట్ల దానికి చెందిన ద్వారాలు మరియు కారణాలు తెలియజేయడం పట్ల ఆసక్తిగా ఉండేవారని ఈ హదీసు తెలియజేస్తుంది.
ఇంకా