عَنْ عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَيْسَ مِنَّا مَنْ لَطَمَ الخُدُودَ، وَشَقَّ الجُيُوبَ، وَدَعَا بِدَعْوَى الجَاهِلِيَّةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1294]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1294]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అఙ్ఞానకాలపు కొన్ని ఆచారాలను నిషేధించినారు మరియు ఆ ఆచారాలను పాటించే వారి పట్ల, “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు. అవి:
మొదటిది: ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు ఎవరైతే చెంపలు కొట్టుకుంటారో. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెంపలను ప్రస్తావించినారు; ఎందుకంటే ఆ కాలములో స్వయంగా చెంపలు కొట్టుకొనుట బాగా వ్యాప్తిలో ఉన్న ఆచారం. నిజానికి ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు చెంపలను మాత్రమే కాక తన ముఖంపై ఎక్కడ కొట్టుకున్నా అది నిషేధమే.
రెండవది: విపరీతమైన కష్టము, బాధ కలిగినపుడు, శరీరంపై ధరించి ఉన్న వస్త్రపు (చొక్కా, కమీజు మొ.) కాలరు భాగం వద్ద బలంగా లాగి చింపుకోవడం. కాలరు భాగము అంటే – తలను దూర్చడానికి అనువుగా, వస్త్రపు పై భాగమున చీలిక ఉన్న భాగము.
మూడవది: పెద్ద గొంతుతో ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, అలా ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ, తనపై వచ్చి పడిన కష్టాన్ని, నాశనాన్ని, నష్టాన్ని తొలగించమని మొరపెట్టుకోవడం.