عن عائشة رضي الله عنها ، قالت: سَأَل رسول الله صلى الله عليه وسلم أُنَاسٌ عن الكُهَّان، فقال: «ليْسُوا بشيء» فقالوا: يا رسول الله إنهم يُحَدِّثُونَا أحْيَانَا بشيء، فيكون حَقَّا؟ فقال رسول الله صلى الله عليه وسلم : «تلك الكلمة من الحَقِّ يخْطفُها الجِنِّي فَيَقُرُّهَا في أُذُنِ وليِّه، فَيَخْلِطُونَ معها مائة كَذِبَة».
وفي رواية للبخاري عن عائشة رضي الله عنها : أنها سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «إن الملائكة تَنْزِل في العَنَانِ -وهو السَّحَاب- فَتَذْكُرُ الأمر قُضِيَ في السماء، فَيَسْتَرِقُ الشيطان السَّمْعَ، فيسمعه، فيُوحِيَه إلى الكُهَّان، فيكذبون معها مائة كَذْبَة من عند أَنْفُسِهم».
[صحيح] - [الرواية الأولى: متفق عليها.
الرواية الثانية: رواها البخاري]
المزيــد ...
ఆయెషా రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తూ తెలిపారు: కొంతమంది మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారిని జ్యోతిష్యుల గురించి ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త బదులిస్తూ ‘వారికి ఏ జ్ఞానం లేదు’ అని చెప్పారు, దానికి వారు “ఓ దైవప్రవక్త! వారు కొన్ని సార్లు మా గురించి చెప్పిన విషయాలు వాస్తవరూపం దాలుస్తాయి కదా?” అని అడిగారు. ప్రవక్త బదులిస్తూ: ఆ విషయాలు సత్యమే అయితే వాటిని జిన్నాతులు (దూతల వద్ద నుండి) ఆకస్మికంగా దొంగిలించి తమ మిత్రుల (జ్యోతిష్యుల) చెవిలో ఊదుతాయి. అప్పుడు ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెప్తారు. బుఖారీ ఉల్లేఖనం ప్రకారం ఇలా ఉంది – ఆయెషా రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారు: నిశ్చయంగా ఆమె దైవప్రవక్త బోధిస్తుండగా విన్నారు - దైవదూతలు అల్లాహ్ ఆదేశాలను తీసుకుని మేఘాల్లోనికి దిగివస్తారు, ఆకాశాల్లో ఆదేశించబడిన దాని గురించి చర్చిస్తారు, అప్పుడు షైతాన్ ఆ విషయాలను దొంగచాటుగా వింటూ ఉంటాడు. వాటిని జ్యోతిష్యులకు అందజేస్తాడు. వారువాటికి వంద అబద్దాలు జోడించి చెప్తారు.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు
ఆయెషా రజియల్లాహు అన్హా ఈ హదీసులో తెలియపరుస్తూ చెప్పారు - ప్రజలు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను ‘భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి సమాచారమిచ్చే జ్యోతిష్యుల గురించి ప్రశ్నించారు, దానికి ఆయన బదులిస్తూ: వారిని పట్టించుకోకండి, ప్రాధాన్యత ఇవ్వకండి మరియు దాన్ని అంగీకరించకండి’ అని చెప్పారు, అప్పుడు వారు: ఓ దైవప్రవక్త, కొన్నిసార్లు వారు చెప్పిన విషయాలు జరుగుతాయి కదా? అనగా ఒకవేళ భవిష్యవాణి (అగోచర సమాచారం) చెప్తూ ‘ఫలా మాసం ఫలా రోజులో జరుగుతుంది’ అని చెప్తే అది వారు చెప్పిన దాని ప్రకారం జరుగుతుంది, ప్రవక్త జవాబు తెలియజేశారు: నిశ్చయంగా జిన్నాతులు ఆకాశ వార్తలను దొంగచాటుగా అపహరించి తమ మిత్రులైన జ్యోతిష్యుల వద్దకి వచ్చి విన్నది చెప్తారు. అయితే ఈ జ్యోతిష్యులు విన్న ఆకాశసమాచారంలో వంద అబద్దాలు జోడించి జనులకు చెప్తారు. బుఖారి ఉల్లేఖనం అర్ధం: ప్రపంచంలో జరగబోయే రోజువారీ విషయాల గురించి అల్లాహ్ జారీచేసే ఆదేశాలను దైవదూతలు ఆకాశంలో వింటారు, పిదప మేఘాల్లోకి దిగుతూ తమ సహచరులతో వాటి గురించి చర్చించుకుంటారు. అప్పుడు షైతాన్ ఆ విషయాలను అపహరించి తన మిత్రులైన జ్యోతిష్యుల వద్దకి వచ్చి చెప్తాడు, అప్పుడు ఈ జ్యోతిష్యులు విన్న దానికి వంద, అంతకు మించి అబద్దాలను జోడిస్తారు.