+ -

عن أنس رضي الله عنه قال:
كُنَّا عِنْدَ عُمَرَ فَقَالَ: «نُهِينَا عَنِ التَّكَلُّفِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 7293]
المزيــد ...

అనస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖనం :
(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 7293]

వివరణ

ఇందులో ఉమర్ రజియల్లాహు అన్హు: “అవసరం లేకపోయినా, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి తాను ఎక్కువ కష్టపడుతున్నట్లుగా ఉద్దేశ్యపూర్వకముగా మాట్లాడుటను, అలాగే అవసరం లేకపోయినా ఆచరణలలోనూ ఉద్దేశ్యపూర్వకముగా చేయుటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారని” ఉల్లేఖించినారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية Малагашӣ ఇటాలియన్ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ‘తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుటకు’ (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ) చెందిన విషయాలు ఏమిటంటే – ఎక్కువగా ప్రశ్నించడం, లేదా తనకు ఏమాత్రమూ ఙ్ఞానము లేని విషయములో ఎక్కువ కష్టపడుతున్నట్లు ప్రదర్శించడం, లేదా ఏదైనా విషయానికి సంబంధించి అల్లాహ్ అన్ని విధాలుగా సమృద్ధిగా సామర్థ్యము ప్రసాదించినప్పటికీ, అవసరం లేకపోయినా ఆ విషయమును ఆచరించుటలో ఎక్కువగా కష్టపడే కఠిన వైఖరిని అవలంబించుట.
  2. ఇందులో – ప్రతి ముస్లిం, తన మాటలలో గానీ, లేక ఆచరణలలో గానీ ఎదుటివారిని ఆకట్టుకోవడానికి ఎక్కువ కష్టపడుతున్నట్టు చూపించడం అనే అల్ప వైఖరి నుండి తనను తాను ఆపుకోవాలి, ప్రతి విషయములోనూ, ఉదా: తినుట, త్రాగుట, మాలాడుట మొదలైన ఇతర అన్ని విషయాలలోనూ, ఉదాత్తతను అలవాటు చేసుకోవాలి
  3. ఇస్లాం సౌలభ్యతను కలిగి యున్న ధర్మము (అంటే తనను అనుసరించుటలో సౌలభ్యమును కలిగి యున్న ధర్మము).
ఇంకా