عن أبي هريرة رضي الله عنه مرفوعاً: "اجتنبوا السبع المُوبِقَات، قالوا: يا رسول الله، وما هُنَّ؟ قال: الشركُ بالله، والسحرُ، وقَتْلُ النفسِ التي حَرَّمَ الله إلا بالحق، وأكلُ الرِّبا، وأكلُ مالِ اليتيم، والتَّوَلّي يومَ الزَّحْفِ، وقذفُ المحصناتِ الغَافِلات المؤمنات".
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూహురైర రజియల్లాహు అన్హ మర్ఫూ ఉల్లేఖనం'వినాశకరమైన ఏడు పాపాల నుండి మిమ్మల్ని రక్షించుకోండి,సహాబాలు ఓ దైవప్రవక్త అవి ఏమిటి ? అని అడిగారు,ప్రవక్త బదులిస్తూ"షిర్కుబిల్లాహ్ (అల్లాహ్'కుఇతరులను భాగస్వామ్య పర్చటం) 2.చేతబడి 3.అకారణంగా అల్లాహ్ నిషేదించిన ప్రాణిని హతమార్చటం 4.వడ్డీ తినడం 5.అనాదల సొమ్మును అన్యాయంగా తినటం 6.యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవటం 7,అభాగ్యురాలైన,అమాయకులైన మహిళలపై అపనిందలు మోపటం" అని తెలియజేశారు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన జాతి ప్రజలకు ఏడు వినాశకర పాపాల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలని ఆదేశించారు,అవి ఏమిటని అడిగినప్పుడు ఉపదేశించారు ‘షిర్కు బిల్లాహ్-అనగా-అల్లాహ్ కు ఇతరులను ఏ విధంగా నైనా సాటికల్పించడం,షిర్కు నుండి ప్రారంభించబడింది ఎందుకంటే అది పాపాల్లో కెల్లా పెద్ద పాపము,మరియు అల్లాహ్ నిషేదించిన ప్రాణిని షరీఅతు బద్దమైన కారణము లేనప్పుడు హత్యచేయడం,చేతబడి చేయడం,వడ్డీ తీసుకోవడం అది తినే రూపంగా కానీ లేదా మరే రకంగానైనా కానీ ప్రయోజనం పొందడం,తండ్రి మరణించిన పిల్లవాడి (అనాధ) డబ్బు నుండి వృధా గా ఖర్చుచేయడం,తిరస్కారులతో జరిగే యుద్దం నుండి వెన్ను చూపి పారిపోవడం మరియు పవిత్రంగా ఉండే మహిళలపై వ్యభిచార అభాండాలను అభియోగించడం.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. షిర్క్ హరామ్ చేయబడింది,ఎందుకంటే అది మహాపరాధాల్లో పెద్దది,పాపాల్లో ఘోరమైనది.
  2. మాంత్రిక విద్య చేతబడి హరాము,ఎందుకంటే అది వినాశకాల్లో పెద్దది,ఇస్లాం నుండి బహిష్కరించేవాటిలో ఒకటి.
  3. అకారణంగా ఒక ప్రాణిని హత్యచేయడం హరాము
  4. ‘ఏదైనా కారణం ఉన్నప్పుడూ అంటే’ ఖిసాస్ (పరిహారం),ఇస్లాం నుండి వెనుతిరిగడం మరియు పెళ్లి తరువాత వ్యభిచరించడం’వంటి పాపాలకు శిక్ష రూపంలో హతమార్చవచ్చు.
  5. వడ్డీ నిషేధించబడింది,అది చాలా ప్రమాదకరమైనది.
  6. అనాధల సొమ్మును అన్యాయంగా దోచుకోవడం నిషేదించబడింది.
  7. యుద్ద రంగం నుండి వెన్ను చూపి పారిపోవడం హరాము.
  8. వ్యభిచారము మరియు లివాతత్ యొక్క అపనిందలు మోపడం హరాము.
  9. కాఫిర్ వేసే అపనిందలు కబాయిర్ కి చెందవు
ఇంకా