عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم:
«اللهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا، لَعَنَ اللهُ قَوْمًا اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 7358]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"
[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 7358]
తన సమాధిని, ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించే మరియు దానికి సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) ఒక విగ్రహం మాదిరిగా చేయకు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు అయిన అల్లాహ్ ను వేడుకున్నారు. ఇంకా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఎవరైతే ప్రవక్తల సమాధులను సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) స్థలంగా చేసుకున్నారో, అల్లాహ్ వారిని తన కారుణ్యం నుండి తొలగించి వేస్తాడని తెలియ జేసినారు. ఎందుకంటే వాటిని ప్రార్థనా స్థలాలుగా చేసుకోవడం అనేది కాలక్రమంలో వాటిపై తమ విశ్వాసాన్ని పెంచు కోవడానికి మరియు వాటిని పూజించడానికి ఒక మార్గంగా మారగలదు.