عن ابْنِ عُمَرَ رضي الله عنهما أنه سَمِعَ رَجُلًا يَقُولُ: لَا وَالْكَعْبَةِ، فَقَالَ ابْنُ عُمَرَ: لَا يُحْلَفُ بِغَيْرِ اللَّهِ، فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ حَلَفَ بِغَيْرِ اللهِ فَقَدْ كَفَرَ أَوْ أَشْرَكَ».
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن الترمذي: 1535]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఒక వ్యక్తి ఇలా అనగా విన్నారు: “కాదు; ఈ కాబా సాక్షిగా” అని. అపుడు ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా అతనితో ఇలా అన్నారు: “అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరునా ప్రమాణం చేయకు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను:
“ఎవరైతే అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే”.
[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అత్తిర్మిదీ - 1535]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ పై కాకుండాఇతరులపై లేదా వారి పేర్లపై లేదా వారి గుణగణాలపై ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్బడినట్లే లేక ఆయనకు సాటి కల్పించినట్లే. ఎందుకంటే ప్రమాణం చేయడం అనేది, మనం ఎవరిపై ప్రమాణం చేస్తున్నామో, నిశ్చయంగా అందులో వారి ఘనతను, వారి ఔన్నత్యాన్ని అనివార్యం చేస్తుంది. నిజానికి ఘనత, ఔన్నత్యమూ ఏకైకుడైన అల్లాహ్ కొరకు మాత్రమే. కనుక పరమ పవిత్రుడైన అల్లాహ్ పై, ఆయన శుభనామములపై లేక ఆయన గుణగణాలపై తప్ప (మరింక ఎవరిపైనా, దేనిపైనా) ప్రమాణము చేయరాదు. (ఇతరుల పేరున) ప్రమాణం చేయడం అనేది “తక్కువ స్థాయి షిర్క్” (అష్షిర్క్ అల్ అస్గర్) అనబడుతుంది. అయితే, (కొంతమంది ఉలమాల అభిప్రాయం ప్రకారం) ప్రమాణం చేయునపుడు, ఎవరి పేరున అయితే ప్రమాణం చేస్తున్నారో అతడిని, సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఏవిధంగానైతే అత్యంత ఉత్తమమైన పేర్లతో, ప్రశంసనీయ పదాలతో పొగుడుతామో, అతడిని కూడా అల్లాహ్ ను స్తుంతించిన స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా స్తుతించినట్లయితే అది “పెద్ద షిర్క్” (అష్షిర్క్ అల్ అక్బర్) అనబడుతుంది.